తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించనున్న ‘TSRJC-2019’ దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి ఏప్రిల్ 10న ఒక ప్రకటనలో తెలిపారు. అసలైతే ఈ రోజుతో (ఏప్రిల్ 11)తో దరఖాస్తు గడువు పుర్తి అవుతుంది.
అయితే 11న ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మే 10 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 1 నుంచి 8 వరకు అందుబాటులో ఉంచనున్నారు. వెబ్‌సైట్ నుంచి మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్దులు దరఖాస్తు ఫీజుగా రూ.150 చెల్లించి ఏప్రిల్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాల్సీ ఉంటుంది.