UPSC recruitment : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Union Public Service Commission to fill vacancies in central government departments

UPSC recruitment : యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిస్ట్ బి, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు 1 ఖాళీ, సైంటిస్ట్ ‘బి’ పోస్టులు 10, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు 1, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ పోస్టులు 13, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆయుర్వేదం) పోస్టులు 1, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 26, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు విషయానికి వస్తే సీనియర్ డిజైన్ ఆఫీసర్‌ పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌కు 35 ఏళ్లు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsc.gov.in/ పరిశీలించగలరు.