యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ‘సివిల్ సర్వీసెస్ -2019’ నోటిఫికేషన్‌ను మంగళవారం (ఫిబ్రవరి 19, 2019)న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 896 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 39 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
* ఎంపిక విధానం:
– UPSC రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మూడు లెవెల్స్‌లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మూడు లెవెల్స్‌లో క్వాలిఫై అయినవారినే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
* రాతపరీక్ష ఎలా ఉంటుంది…?
– UPSC Civil Services ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు(జనరల్ స్టడీస్ పేపర్-1, జనరల్ స్టడీస్ పేపర్-2) ఉంటాయి. ప్రతీ పేపర్‌కు 200 మార్కులు. మల్టిపుల్ ఛాయిస్, ఆబ్జెక్టీవ్ టైప్ ప్రశ్నలుంటాయి. మెయిన్ ఎగ్జామ్‌కు ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ పరీక్ష మాత్రమే. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకోరు. మెయిన్స్‌లో 1750 మార్కులు, ఇంటర్వ్యూలో 275 మార్కులుంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ రౌండ్‌లో మార్కులను బట్టి మెరిట్ స్కోర్ ఇస్తారు.
* వయసు పరిమితి:
– 01.08.2019 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1987 – 01.08.1998 మధ్య జన్మించి ఉండాలి.
* దరఖాస్తు ఫీజు:
– రూ.100. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
* ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 19.02.2019. |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 18.03.2019. |
ప్రిలిమ్స్ పరీక్ష తేది | 02.06.2019. |
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (మెయిన్) | సెప్టెంబరు 20 నుంచి |