UPSC ESE 2024 Interview : యూపీఎస్సీ ఈఎస్ఈ 2024 ఇంటర్వ్యూ, ఫుల్ షెడ్యూల్‌ ఇదిగో.. అక్టోబర్ 7 నుంచే ప్రారంభం!

UPSC ESE 2024 Interview : యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (upsc.gov.in)ను విజిట్ చేసి షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు. యూపీఎస్సీ ఈఎస్ఈ 2024లో పర్సనాలిటీ టెస్ట్ కోసం మొత్తం 617 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

UPSC Engineering Services Examination 2024 Interview

UPSC ESE 2024 Interview : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అక్టోబర్ 7న ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2024 ఇంటర్వ్యూను నిర్వహించనుంది. ఈఎస్ఈ-2024 పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (upsc.gov.in)ను విజిట్ చేసి షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు. యూపీఎస్సీ ఈఎస్ఈ 2024లో పర్సనాలిటీ టెస్ట్ కోసం మొత్తం 617 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. \

Read Also : CBSE Board Exams 2025 : సీబీఎస్ఈ పరీక్షకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. “ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ మంజూరు అవుతుంది. రెండో/స్లీపర్ క్లాస్ రైలు ఛార్జీలకు (మెయిల్ ఎక్స్‌ప్రెస్) పరిమితం. అభ్యర్థులు ఏదైనా ఇతర మోడ్/క్లాస్ ద్వారా ప్రయాణిస్తే.. అదే విధంగా ఉంటుంది. ఎస్ఆర్-132 కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలి.

దీనికి సంబంధించిన వివరాలను పొందాలంటే కమిషన్ వెబ్‌సైట్‌లో (https://upsc.gov.in/forms-downloads)లో అందుబాటులో ఉంటుంది. రోల్ నంబర్ల ఆధారంగా షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు షెడ్యూల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారి రోల్ నంబర్ ప్రకారం.. ఇంటర్వ్యూ తేదీని చెక్ చేయవచ్చు.

యూపీఎస్సీ ఈఎస్ఈ 2024 : షెడ్యూల్ డౌన్‌లోడ్ చేయాలంటే? :

  • యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (upsc.gov.in)కి వెళ్లండి
  • హోమ్‌పేజీలో, యూపీఎస్సీ ఈఎస్ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ 2024పై క్లిక్ చేయండి
  • కొత్త పేజీలో కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • మీ ఇంటర్వ్యూ తేదీని చెక్ చేయండి. దానిని డౌన్‌లోడ్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం షెడ్యూల్ ప్రింటవుట్ తీసుకోండి.

ఈ పరీక్ష ద్వారా యూపీఎస్సీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో వివిధ గ్రూప్ A, B సేవలకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసి సిఫార్సు చేస్తుంది.

యూపీఎస్సీ ఈఎస్ఈ 2024, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే నాలుగు విభాగాలలో బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) ఉన్న వ్యక్తులకు 5 రిజర్వ్ చేసిన స్థానాలతో సహా సుమారు 167 స్థానాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Engineers Day 2024 : హ్యాపీ ఇంజినీర్స్ డే 2024.. ఈ ప్రత్యేకమైన రోజును ఎందుకు జరుపుకుంటామో తెలుసా?