Doordarshan Recruitment : దూరదర్శన్ న్యూస్ లో వీడియో గ్రాఫర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ,గుర్తింపు పొందిన యూనివర్శిటీ, సంస్థ నుంచి సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీలో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉండాలి. వీడియోగ్రఫీ,సినిమాటోగ్రఫీ లేదా ఏదైనా ఇతర సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.

Doordarshan Recruitment : దూరదర్శన్ న్యూస్ లో వీడియో గ్రాఫర్ పోస్టుల భర్తీ

Videographer Posts Recruitment in Doordarshan News

Updated On : April 21, 2023 / 3:05 PM IST

Doordarshan Recruitment : ప్రసారభారతికి చెందిన దూరదర్శన్ న్యూస్ లో వీడియో గ్రాఫర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసిస్ క్రింద మొత్తం 41 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనుభవంతోపాటు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ,గుర్తింపు పొందిన యూనివర్శిటీ, సంస్థ నుంచి సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీలో డిగ్రీ, డిప్లొమా అర్హత ఉండాలి. వీడియోగ్రఫీ,సినిమాటోగ్రఫీ లేదా ఏదైనా ఇతర సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.

READ ALSO :vegetables Cultivation : అర ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు.. ఏడాదికి రూ.1 లక్షా 50 వేల ఆదాయం

అభ్యర్థులు పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ , టెస్ట్ కోసం పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.40000 నెలవారీ వేతనం చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://applications.prasarbharati.org/