Visva Bharati Recruitment : విశ్వ భారతి శాంతినికేతన్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునేందుకు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు అర్హులు. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి రూ.32 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Visva Bharati Recruitment
Visva Bharati Recruitment : విశ్వ భారతి శాంతినికేతన్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 709 ఖాళీలను భర్తీ చేయనుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో డివిజన్ క్లర్క్, జూనియర్ ఆఫీసర్ కమ్ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అప్పర్ డివిజన్ క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Heat Wave : ఎండాకాలం వేసవి తాపాన్ని తట్టుకునేందుకు రోజుకు ఎన్నిసార్లు సాన్నం చేయాలో తెలుసా?
దరఖాస్తు చేసుకునేందుకు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినవారు అర్హులు. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి రూ.32 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,200ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : Digestive System : వేసవిలో జీర్ణప్రక్రియ సవ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తీసుకోవటం మంచిది !
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు 16 మే 2023లోపు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.2000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sscadda.com/visva-bharati-recruitment-2023/ పరిశీలించగలరు.