Bullet Train Jobs : బుల్లెట్ రైలు ప్రాజెక్టులో గోల్డెన్ ఛాన్స్.. 237 ఉద్యోగాలు, రూ.1.10 లక్షల వరకు జీతం, ఇప్పుడే అప్లయ్ చేయండి!
Bullet Train Posts : బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ (nhsrcl.in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 1.10 లక్షల వరకు జీతం వస్తుంది.
- Sreehari A
- Published on- July 10, 2026 / 07:04 PM IST
Bullet Train Posts
Bullet Train Posts : భారత ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ఆగస్టు 15, 2027 సూరత్-బిలిమోరా సెక్షన్‌తో ప్రారంభం కానుంది. 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్‌లో ఈ బుల్లెట్ ట్రైన్ నడవనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. జపనీస్ షింకన్సెన్ టెక్నాలజీతో ఈ బుల్లెట్ రైలును నిర్మించారు.
అయితే, ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL), పలు టెక్నికల్ విభాగాలలో 237 టెక్నీషియన్ ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 5, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ (nhsrcl.in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సిగ్నలింగ్ అండ్ టెలికాం టెక్నీషియన్, సివిల్/ట్రాక్ ఫిట్టర్ టెక్నీషియన్, సివిల్/ట్రాక్ మెకానిక్ టెక్నీషియన్, ఇతర పోస్టులను భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
రిక్రూట్‌మెంట్ 2026 ఖాళీలివే :
- ఎలక్ట్రికల్ టెక్నీషియన్ : 77 పోస్టులు
- సిగ్నలింగ్, టెలికాం టెక్నీషియన్ : 63 పోస్టులు
- సివిల్/ ట్రాక్ ఫిట్టర్ టెక్నీషియన్ : 18 పోస్టులు
- సివిల్/ ట్రాక్ మెకానిక్ టెక్నీషియన్ : 16 పోస్టులు
- రోలింగ్ స్టాక్ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ : 13 పోస్టులు
- రోలింగ్ స్టాక్ ఫిట్టర్ టెక్నీషియన్ : 10 పోస్టులు.
- పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.
Multiple vacancies are now open across various departments for the Mumbai–Ahmedabad Bullet Train Project.
Ready to be a part of India’s high-speed rail journey? Take the right step by applying only through the official NHSRCL website.
Visit the Careers → Vacancy Notice section… pic.twitter.com/GQmmjJ4pz6
— NHSRCL (@nhsrcl) July 6, 2026
ఎలా అప్లయ్ చేయాలంటే? :
అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకుని, ఫారమ్ మొత్తాన్ని నింపాలి. మీ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, గడువుతేదీలోగా మీ దరఖాస్తు రుసుమును సమర్పించాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్‌సైట్ (nhsrcl.in)ను విజిట్ చేయండి.
- NHSCRL దరఖాస్తు ఫారం PDF లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ఇమెయిల్, ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
- లాగిన్ తర్వాత మీ విద్యా, వృత్తిపరమైన వివరాలు, వ్యక్తిగత వివరాలను నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజును మాత్రం ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- మీ రికార్డుల కోసం ఫైనల్ కన్ఫార్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ కూడా దగ్గర పెట్టుకోండి.
అర్హతలివే :
ఇండియన్ రైల్వేస్, ప్రభుత్వ యాజమాన్యంలో లేదా రైల్వేలు, మెట్రో రైల్వేలు లేదా ఆర్ఆర్టీఎస్‌లలో ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులు, కనీసం 2 ఏళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హతలివే :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/SSLCతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్, సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్‌తో కూడిన మెట్రిక్యులేషన్/SSLC, లేదా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.
శాలరీ రేంజ్ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35వేల నుంచి రూ. 1,10,000 వరకు జీతం ఉంటుంది. పోస్టులను బట్టి జీతం రేంజ్ మారుతుంది.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 400, పేమెంట్ ఛార్జీలు చెల్లించాలి. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మహిళా అభ్యర్థులకు పూర్తి మినహాయింపు ఉంది. NHSCRL రిక్రూట్‌మెంట్ 2026 వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ (nhsrcl.in) విజిట్ చేయండి.
