MCD elections: ఆప్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం.. దాడి చేసి తరిమికొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు

అదే సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేతో కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరి, కొందరు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకుని దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే బయటకు పరుగులు తీసినా వదిలిపెట్టలేదు. వెంబడించి వెంబడించి మరీ దాడి చేశారు. ఇక చేసేందేం లేక సమీపంలోని పోలీస్ స్టేషన్‭లోకి వెళ్లి తలదాచుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది ఆ ఎమ్యెల్యేకు.

MCD elections: ఎన్నికలు వచ్చాయంటే చాలు.. వైరి పార్టీల మధ్య జరిగే గొడవల కంటే పార్టీలోని నేతలు, కార్యకర్తల మధ్య జరిగే గొడవలే ఎక్కువగా కనిపిస్తాయి. కారణం, టికెట్ల కేటాయింపు. అనేక మంది ఆశావాహులు ఉంటారు, వారందరికీ టికెట్లు కేటాయించడం కష్టం అవుతుంది. అలాగే టికెట్ల పంపిణీలో కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. వీటి వల్ల అప్పటి వరకు ఒక చెట్టు నీడ కిందే ఉన్న నేతలు శత్రువులుగా మారిపోతారు. చాలా సందర్భాల్లో ఈ గొడవలు మాటల వరకే ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో పెద్ద తగాదాలకు దారి తీస్తాయి.

తాజాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన టికెట్ల పంపిణీ కార్యక్రమం సైతం తీవ్ర గొడవకు దారి తీసింది. ఎంత వరకు వెళ్లిందంటే.. ఏకంగా ఎమ్మెల్యేను వెంబడించి వెంబడించి కొట్టారు అదే పార్టీకి చెందిన కార్యకర్తలు. ఢిల్లీలోని మటియాలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత గులాబ్ సింగ్ యాదవ్‭ సోమవారం రాత్రి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలతో చర్చించారు.

అదే సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేతో కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరి, కొందరు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకుని దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే బయటకు పరుగులు తీసినా వదిలిపెట్టలేదు. వెంబడించి వెంబడించి మరీ దాడి చేశారు. ఇక చేసేందేం లేక సమీపంలోని పోలీస్ స్టేషన్‭లోకి వెళ్లి తలదాచుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది ఆ ఎమ్యెల్యేకు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ సహా ఇతర విపక్ష నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకోవడం మూలంగానే కార్యకర్తలు ఆగ్రహానికి లోనై దాడి చేశారని బీజేపీ విమర్శించింది. అయితే ఇది బీజేపీ చేయించిన దాడని ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ప్రతిదాడి చేశారు.

Bharat Jodo Yatra: రేపటి నుంచి భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న ప్రియాంక వాద్రా.. నాలుగు రోజులు సోదరుడి వెంటే..

ట్రెండింగ్ వార్తలు