Bharat Jodo Yatra: రేపటి నుంచి భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న ప్రియాంక వాద్రా.. నాలుగు రోజులు సోదరుడి వెంటే..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా రేపు పాల్గోనున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగే యాత్రలో నాలుగు రోజులు సోదరుడు వెంట ఆమె యాత్రలో పాల్గొంటారు.

Bharat Jodo Yatra: రేపటి నుంచి భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న ప్రియాంక వాద్రా.. నాలుగు రోజులు సోదరుడి వెంటే..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రెండు రోజుల విరామం తరువాత రేపటి నుంచి పున: ప్రారంభమవుతుంది. బుధవారం బుర్హాన్‌పూర్ సమీపంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్రా కూడా పాల్గోనున్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ట్వీటర్ ద్వారా తెలిపారు.

Bharat Jodo Yatra: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. సోమ, మంగళవారాల్లో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనడంతో భారత్ జోడో యాత్రను వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. రేపటి (బుధవారం) నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. బుర్హాన్‌పూర్ సమీపంలోని మధ్యప్రదేశ్‌లో యాత్ర ప్రవేశిస్తుందన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ వెంట యాత్రలో పాల్గొంటారని జైరామ్ రమేష్ తెలిపాడు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇప్పటికే సోనియా గాంధీ పాల్గొన్నారు. కర్ణాటకలోని మాండ్యాలో రాహుల్ గాంధీతో కలిసి సోనియా పాదయాత్ర చేశారు. సోనియాతో పాటు ప్రియాంక వాద్రాకూడా యాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ సమయంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, ప్రియాంక వాద్రా పార్టీ ప్రచారంలో బిజీగా ఉండటంతో యాత్రలో పాల్గొనలేక పోయింది. రేపు మధ్యప్రదేశ్‌కు చేరుకొని రాహుల్‌గాంధీ వెంట ప్రియాంకవాద్రా యాత్రలో జాయిన్ అవుతుంది. నాలుగు రోజులు పాటు సోదరుడి వెంటే ప్రియాంక వాద్రా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.