Bypolls: ముగిసిన పోలింగ్.. ఏ నియోకవర్గాల్లో ఎంత ఓటింగ్ నమోదైందంటే?

అతి ఎక్కువగా తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అతి తక్కువగా ముంబైలోని తూర్పు అంధేరి నియోజకవర్గంలో 31.74 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

Assembly By Elections polling percentage

Bypolls: దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని తూర్పు అంధేరి, హర్యానాలోని అదాంపూర్, ఉత్తరప్రదేశ్‭లోని గోలా గోరఖ్‭నాథ్, బిహార్‭లోని గోపాల్ గంజ్ & మొకమ, ఒడిశాలొని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినట్లు ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది.

అతి ఎక్కువగా తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అతి తక్కువగా ముంబైలోని తూర్పు అంధేరి నియోజకవర్గంలో 31.74 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

ముంబైలోని ఈస్ట్ అంధేరిలో 31.74 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలోని మునుగోడులో 77.55 శాతం ఓటింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోలా గోరఖ్‭నాథ్ అసెంబ్లీ నియోజవర్గంలో 55.68 శాతం, బిహార్‭లోని గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 48.35 శాతం, అదే రాష్ట్రంలోని మొకమ నియోజకవర్గంలో 52.47 శాతం, ఒడిశాలోని ధాంనగర్ నియోజకవర్గంలో 66.63 శాతం, హర్యానాలోని అదాంపూర్ నియోజకవర్గంలో 72.25 శాతం పోలింగ్ నమోదైనట్లు గురువారం సాయంత్రం ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

Imran Khan: అందుకే ఇమ్రాన్ ఖాన్‭ను చంపాలనుకుంటున్న.. మీడియా ముందు షూటర్