Imran Khan: అందుకే ఇమ్రాన్ ఖాన్‭ను చంపాలనుకుంటున్న.. మీడియా ముందు షూటర్

స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు

Imran Khan: అందుకే ఇమ్రాన్ ఖాన్‭ను చంపాలనుకుంటున్న.. మీడియా ముందు షూటర్

I wanted to kill Imran Khan because he was misleading people, confesses shooter in video

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‭పై కాల్పులు జరిపిన దుండగుడు.. అందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ప్రజలను ఇమ్రాన్ తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకే ఆయనను చంపాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే తాను కేవలం ఇమ్రాన్ లక్ష్యంగానే కాల్పులు జరిపానని, కానీ అనుకోకుండా ఇతరులు గాయపడ్డట్లు వెల్లడించాడు. నిందితుడి వీడియోను పాకిస్తాన్‭కు చెందిన హసద్ అయూబ్ ఖాన్ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‭లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ గాయపడ్డారు. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్‌తోపాటు క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో ఆయన మేనేజర్‌తోపాటు ఇతర అనుచరులు కూడా గాయపడ్డారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Bihar: మళ్లీ ఏకం కానున్న పాశ్వాన్ కుటుంబం.. బాబాయ్, అబ్బాయ్ మధ్య సంధి కుదిర్చిన బీజేపీ