Bihar: మళ్లీ ఏకం కానున్న పాశ్వాన్ కుటుంబం.. బాబాయ్, అబ్బాయ్ మధ్య సంధి కుదిర్చిన బీజేపీ

మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్టీకి చిరాగ్ బద్ధ వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే పోటీ చేశారు.

Bihar: మళ్లీ ఏకం కానున్న పాశ్వాన్ కుటుంబం.. బాబాయ్, అబ్బాయ్ మధ్య సంధి కుదిర్చిన బీజేపీ

Paswan family will come together again

Bihar: రెండుగా చీలిపోయిన పాశ్వాన్ కుటుంబం ఏకం కానుంది. కుటుంబంతో పాటు చీలిపోయిన పార్టీ కూడా ఏకం కానుంది. ఈ రెండు కుటుంబాలను కలిపే బృహత్తర కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తన భుజాలపైకి ఎత్తుకుంది. బీజేపీ కుదిర్చిన సయోధ్య వల్లే ఇరు వర్గాలు ఒకటి కానున్నట్లు స్వయంగా చిరాగ్ పాశ్వానే వెల్లడించారు.

రాంవిలాస్ పాశ్వాన్ మరణం అనంతరం.. ఆయన సోదరుడు పశుపతి పారస్, కుమారుడు చిరాగ్ పాశ్వాన్ విడిపోయారు. వారితో పాటే లోక్‭ జనశక్తి పార్టీ(ఎల్‭జేపీ)ని సైతం రెండుగా చేశారు. పశుపతి పారస్ నేతృత్వంలోని వర్గానికి రాష్ట్రీయ లోక్‭తాంత్రిక్ జనతా పార్టీ అని అలాగే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని వర్గానికి లోక్‭తాంత్రిక్ జనతా పార్టీ రాం విలాస్ పాశ్వాన్ అని ఎన్నికల సంఘం పేర్లు ఖరారు చేసింది. ఇరు పార్టీలకు వేరు వేరు గుర్తులు కేటాయించింది.

మొత్తం ఆరుగురు ఎంపీలు ఉండగా.. ఐదుగురు ఎంపీలు పశుపతి వర్గంలోకి వెళ్లగా.. ఇటు వైపు వర్గంలో చిరాగ్ ఒక్కరే ఎంపీ. మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్టీకి చిరాగ్ బద్ధ వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జేడీయూ పోటీ చేసిన స్థానాల్లోనే పోటీ చేశారు.

అయితే ఊహించని పరిమాణాలతో ఎన్డీయే నుంచి నితీశ్ బయటికి వెళ్లారు. దీంతో చిరాగ్‭కు మంచి అవకాశం దొరికింది. వెంటనే యూటర్న్ తీసుకుని బీజేపీ వైపు మళ్లారు. అయితే పశుపతి పారాసే ఎటు తేల్చుకోలేకుండా ఉండిపోయారు. పైగా రాం విలాస్ పాశ్వాన్ పేరుతో వచ్చే ఓట్ బ్యాంక్ చిరాగ్ వద్దే ఉందని గ్రహించి, ఇక తాను సయోధ్యకు రావాలని అనుకున్నారట. ఇది గమనించి పారాస్, చిరాగ్ మధ్య బీజేపీ సంధి కుదిర్చినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో వీరు ఏకం అవ్వడం అధికారికంగా పూర్తవుతుందని అంటున్నారు. ఇది ఎల్‭జేపీని మళ్లీ పునరుద్దరించడానికి ఉపయోగపడుతుందని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా నితీశ్ వెళ్లడంతో ఏర్పడ్డ ఖాళీ కూడా పూర్తవుతుందని బీజేపీ భావిస్తోంది.

Bypolls: ఉప ఎన్నిక నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకోవడం ఎస్పీకి కలిసి వస్తుందా?