Bypolls: ఉప ఎన్నిక నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకోవడం ఎస్పీకి కలిసి వస్తుందా?

ఈ యేడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. బీఎస్పీ కేవలం ఒకే స్థానానికి పరిమితం అయింది. అనంతరం జరుగిన ఉప ఎన్నికలో కూడా ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి కలిసి వచ్చింది. దీంతో పాత ఫార్ములాకే మళ్లీ పట్టం కట్టారు. పోటీ నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకుని.. పరోక్షంగా ఎస్పీకి సహాయపడుతున్నారు

Bypolls: ఉప ఎన్నిక నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకోవడం ఎస్పీకి కలిసి వస్తుందా?

BSP, Congress staying away from the contest in Gola Gokarnath bypoll

Bypolls: ఉత్తరప్రదేశ్‭లోని గోలా గోరఖ్‭నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షం సమాజ్‭వాదీ పార్టీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్ పార్టీ సహా కాంగ్రెస్ పార్టీ ఈ పోటీ నుంచి తప్పుకున్నాయి. ఈ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఎస్పీకి కలిసి వస్తుందని అంటున్నారు.

గతంలో సైతం జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ పోటీ నుంచి తప్పుకోవడం ఎస్పీకి బాగా కలిసి వచ్చింది. ఆ ఎన్నికలన్నింటిలో ఎస్పీ విజయం సాధించింది. ఇదే సూత్రాన్ని పాటించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో ఈ ఎత్తు పని చేయలేదు. 80 స్థానాలున్న యూపీలో ఈ కూటమి కేవలం 15 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో ఎన్నికల ఫలితాల అనంతరమే పొత్తు విచ్ఛిన్నం అయింది.

ఈ యేడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. బీఎస్పీ కేవలం ఒకే స్థానానికి పరిమితం అయింది. అనంతరం జరుగిన ఉప ఎన్నికలో కూడా ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి కలిసి వచ్చింది. దీంతో పాత ఫార్ములాకే మళ్లీ పట్టం కట్టారు. పోటీ నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకుని.. పరోక్షంగా ఎస్పీకి సహాయపడుతున్నారు. దీనిని ఎస్పీ ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది.

Bypolls: తూర్పు అంధేరీలో శివసేన గెలుపు ఖాయం.. నేటి పోలింగ్ నామమాత్రమే!