Bypolls: తూర్పు అంధేరీలో శివసేన గెలుపు ఖాయం.. నేటి పోలింగ్ నామమాత్రమే!

శివసేన రెండుగా చీలిపోయాక.. మొదటి ఎన్నిక ఇదే. ఈ ఎన్నికతో శివసేన పార్టీపై ప్రజల్లోని విశ్వాసం ఏంటో తెలుస్తుందని అనేక విశ్లేషణలు వచ్చినప్పటికీ.. సెంటిమెంటు కారణంగా అన్ని పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. మహా వికాస్ అగాఢీలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటిసారి ఉద్ధవ్ శివసేనకు మద్దతుగా పోటీ చేయడం లేదని ముందే ప్రకటించాయి. ఇక బీజేపీ పోటీకి సై అనడంతో ఏక్‭నాథ్ షిండే పోటీకి దూరంగా ఉన్నారు

Bypolls: తూర్పు అంధేరీలో శివసేన గెలుపు ఖాయం.. నేటి పోలింగ్ నామమాత్రమే!

Stakes high for Uddhav Thackeray in Andheri East bypoll

Bypolls: ముంబైలోని తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మరికాసేపట్లో ముగియనుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం తూర్పు అంధేరిలో మద్యాహ్నం 2:00 గంటల వరకు 22.85 పోలింగ్ నమోదైంది. వాస్తవానికి నగర ప్రాంతాల్లో పోలింగ్ కాస్త తక్కువగానే నమోదు అవుతుంది. అయితే అంధేరిలో మరింత తక్కువగా నమోదు అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక ఈ ఉప ఎన్నికలో గెలుపు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనదేనని అంటున్నారు. పోటీలో ఏ ప్రధాన రాజకీయ పార్టీ లేదు. కారణం, ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చనిపోయిన ఎమ్మెల్యే భార్య పోటీలో ఉండడం. శివసేన నేత రమేశ్ లాక్టే మరణించడంతో ఉప ఎన్నిక ఏర్పడింది. ప్రస్తుతం పోటీలో ఆయన భార్య రుతుజ పోటీలో ఉన్నారు.

శివసేన రెండుగా చీలిపోయాక.. మొదటి ఎన్నిక ఇదే. ఈ ఎన్నికతో శివసేన పార్టీపై ప్రజల్లోని విశ్వాసం ఏంటో తెలుస్తుందని అనేక విశ్లేషణలు వచ్చినప్పటికీ.. సెంటిమెంటు కారణంగా అన్ని పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. మహా వికాస్ అగాఢీలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటిసారి ఉద్ధవ్ శివసేనకు మద్దతుగా పోటీ చేయడం లేదని ముందే ప్రకటించాయి. ఇక బీజేపీ పోటీకి సై అనడంతో ఏక్‭నాథ్ షిండే పోటీకి దూరంగా ఉన్నారు. అయితే అభ్యర్థిని ప్రకటించిన అనంతరం రాజ్ థాకరే విజ్ణప్తితో బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది.

దాదాపుగా ఏకగ్రీవం అయింది. అయితే కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీలు పోటీలో ఉండడం వల్ల పోలింగ్ అనివార్యమైంది. అయినప్పటికీ విజయం శివసేనదే అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. భారీ మెజారిటీతో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రుతుజ విజయం సాధించనున్నట్లు అంచానాలు వెలువడుతున్నాయి.

Bypolls: తెలంగాణలోని మునుగోడు, హర్యానాలోని అదాంపూర్ ఉప ఎన్నికలకు కారణం ఒకటే