I wanted to kill Imran Khan because he was misleading people, confesses shooter in video
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడు.. అందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ప్రజలను ఇమ్రాన్ తప్పుదోవ పట్టిస్తున్నారని, అందుకే ఆయనను చంపాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే తాను కేవలం ఇమ్రాన్ లక్ష్యంగానే కాల్పులు జరిపానని, కానీ అనుకోకుండా ఇతరులు గాయపడ్డట్లు వెల్లడించాడు. నిందితుడి వీడియోను పాకిస్తాన్‌కు చెందిన హసద్ అయూబ్ ఖాన్ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్‌తోపాటు క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో ఆయన మేనేజర్‌తోపాటు ఇతర అనుచరులు కూడా గాయపడ్డారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Bihar: మళ్లీ ఏకం కానున్న పాశ్వాన్ కుటుంబం.. బాబాయ్, అబ్బాయ్ మధ్య సంధి కుదిర్చిన బీజేపీ
حملہ آور نے اقبال جرم کرتے ہوئے وضاحت بھی کر دی کہ اس نے یہ حملہ کیوں کیا ہے۔ pic.twitter.com/MO2KJTzt7g
— Hassan Ayub Khan (@HassanAyub82) November 3, 2022