Assembly Elections 2023: ద్రవ్యోల్బణం నాటి పేద ప్రజల స్థితిగతుల దృశ్యం ఆదివారం దిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో కనిపించింది. ఇక్కడ బీజేపీ బూత్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు రొట్టెల కోసం ఒకరినొకరు తోసుకున్నారు. అలాగే భండారాపై దాడి చేసి దోచుకున్నారు. రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి, బూత్ సదస్సులో ప్రసంగించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్.. కార్యక్రమం ముగించుకుని హెలిప్యాడ్‌కు బయలుదేరిన వెంటనే, ఆకలితో అలమటించిన కార్యకర్తలు భండారాపై దాడి చేశారు. చేతికి దొరికిన దాన్ని అందుకొని పారిపోయారు. పూరీలు, కూరగాయలు పట్టుకెళ్లడం చూడొచ్చు. నిజానికి మధ్యప్రదేశ్ లో బీజేపీ చాలా బలంగా ఉంది. అక్కడి బీజేపీ కార్యకర్తల్లో కూడా క్రమశిక్షణ ఎక్కువగానే ఉంటుందని అంటారు. అయితే తాజా ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
దిమాని నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ బరిలోకి దిగుతున్నారు. ఆయన మొదటిసారిగా తన అసెంబ్లీ నియోజకవర్గం చేరుకున్న అనంతరం ఇలా జరిగింది. ఆయన తన కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు బూత్ వర్కర్ల సదస్సు నిర్వహించారు. ఇందులో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.