Karnataka Polls: సీట్లలోనే కాదు, ఓట్లలోనూ కాంగ్రెస్ పార్టీ సరికొత్త దూకుడు.. కర్ణాటకలో హస్తం హవా

ప్రస్తుతం లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఓట్ల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకున్నట్లే కనిపిస్తోంది

Karnataka Assembly Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ (congress party) దూకుడు కొనసాగిస్తోంది. మెజారిటీ మార్కు 113 స్థానాలు కాగా, ఎన్నికల సంఘం (election commission) అధికారి వెబ్‭సైట్ ప్రకారం.. 115 స్థానాల్లో (ఉదయం 11 గంటల సమయంలో) కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాగిస్తోంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ పార్టీ అందుకున్నట్లుగానే కనిపిస్తోంది. సీట్లలోనే కాదు, ఓట్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే 40 శాతం సీట్లు పెంచుకున్న కాంగ్రెస్ (లెక్కింపు కొనసాగుతోంది).. ఓట్లలో కూడా అదే శాతాన్ని రాబడుతోంది.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ముఖ్య నేతల పరిస్థితి ఏంటంటే?

ప్రస్తుతం లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఓట్ల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకున్నట్లే కనిపిస్తోంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 36 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఈసారి సైతం అదే స్థాయిలో ఓట్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి అయిన లెక్కింపులో బీజేపీకి 36 శాతం ఓట్లు లభించాయి.

By-Election: ఉప ఎన్నికల్లో కూడా కనిపించని బీజేపీ.. ఆప్, బీజేడీ, ఎస్పీ హవా

ఈ ఎన్నికల్లో ఓట్ల విషయంలో బాగా నష్టపోయింది జనతాదళ్ సెక్యూలర్ పార్టీనే. గత ఎన్నికల్లో 18.3 ఓట్లు సాధించిన ఆ పార్టీ.. ఈసారి లెక్కింపులో 13 ఓట్ల శాతం వద్దే (ఉదయం 11 గంటల వరకు జరిగిన లెక్కింపు ప్రకారం) ఆగిపోయినట్లు ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడిస్తున్నాయి.