Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ముఖ్య నేతల పరిస్థితి ఏంటంటే?
చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.

Karnataka Assembly Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. కాంగ్రెస్ పర్ాటీ ఇప్పటికే తన ఆధిపత్యాన్ని సాగిస్తోంది. మెజారిటీ మార్కును దాటి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పోటీ చేసిన ముఖ్య నేతలు పోటీ చేసిన స్థానాలపై ఆసక్తి నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలు ఆధిక్యంలో ఉండగా అదే పార్టీకి చెందిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వెనుకంజలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.
ఉదయం 10 గంటల వరకు విడుదలైన ఫలితాల ప్రకారం.. కొందరి ముఖ్య నేతల ఫలితాలు ఇవి.
సిద్ధరామయ్య (కాంగ్రెస్) – ముందంజ
డీకే శికుమార్ (కాంగ్రెస్) – ముందంజ
బసవరాజు బొమ్మై (బీజేపీ-సీఎం) – ముందంజ
హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) – ముందంజ
లక్ష్మణ్ సంగప్ప సవాది (కాంగ్రెస్) – ముందంజ
సీటీ రవి (బీజేపీ) – ముందంజ
ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్) – ముందంజ
జగదీశ్ షెట్టర్ (కాంగ్రెస్) – వెనుకంజ
నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) – ముందంజ
విజయేంద్ర యడియూరప్ప (బీజేపీ) – వెనుకంజ
జీ.సోమేశ్వర్ రెడ్డి (బీజేపీ) – వెనుకంజ
జీ.కరుణాకర్ రెడ్డి (బీజేపీ) – వెనుకంజ
హెచ్డీ రేవణ్ణ (జేడీఎస్) – ముందంజ