DK Shivakumar
Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే కచ్చితమైన సీట్లు ఇవేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్కొన్నారు. 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలను గెలుస్తుందని బుధవారం ఓ జాతీయ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ డీకే అన్నారు. వాస్తవానికి 113 స్థానాలు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. దాని కంటే 28 స్థానాలు ఎక్కువే గెలుస్తామని డీకే ధీమా వ్యక్తం చేశారు.
Quthbullapur Constituency: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉంది?
కర్ణాటక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధిస్తారా? అని డీకేను ప్రశ్నించగా ‘‘కచ్చితంగా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. భారీ మెజారిటీతోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకు జేడీఎస్ అవసరం కూడా ఉండదు’’ అని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి గురువారం రెండవ జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. దీంతో కలిపి మొత్తంగా 166 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన 58 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Hanuman Janmotsav: గాలిలో డ్రోన్లు, నేలపై రెండింతల భద్రత నడుమ ‘హనుమాన్ జయంతి’
ఇక పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే పని చేస్తామని, అందులో ఎవరు ఎలాంటి బాధ్యతలు తీసుకున్నా అధిష్టానం నిర్ణయాల్ని శరసావహిస్తామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీకి వచ్చే నెల 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా ఫలితాలు మూడు రోజుల అనంతరం, అంటే 13వ తేదీన విడుదల కానున్నాయి.