Uniform Civil Code: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజాందోళనలతో వెనక్కి తగ్గిన బీజేపీ సర్కారు మళ్లీ సున్నితమైన యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాలని యోచిస్తోంది.ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ఆరంభిస్తున్నట్లు 22వ భారత లా కమిషన్ బుధవారం రాత్రి పబ్లిక్ నోటీసు జారీ చేసింది....

Uniform Civil Code

Before 2024 elections process on Uniform Civil Code: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజాందోళనలతో వెనక్కి తగ్గిన బీజేపీ సర్కారు మళ్లీ సున్నితమైన యూనిఫాం సివిల్ కోడ్‌ను(Uniform Civil Code) అమలు చేయాలని యోచిస్తోంది. యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ఆరంభిస్తున్నట్లు 22వ భారత లా కమిషన్ బుధవారం రాత్రి పబ్లిక్ నోటీసు జారీ చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ పై సాధారణ ప్రజలతో పాట గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను లా కమిషన్ ఆహ్వానించింది. లా కమిషన్ నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల లోగా అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.

Pawan Kalyan: అమరావతిలోనే ఆంధ్ర రాజధాని

గతంలో 21వ లా కమిషన్ ఆఫ్ ఇండియా యూనిఫాం సివిల్ కోడ్‌ అంశాన్ని పరిశీలించింది. 2016వ సంవత్సరం అక్టోబర్ 7వతేదీన ప్రశ్నాపత్రంతో పాటు తన అప్పీల్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కోరింది. 21వ లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతిపై రెండుసార్లు ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అయితే 21 లా కమిషన్ కాలపరిమితి ముగిసింది.కుటుంబ చట్టాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకు 2018వ సంవత్సరం ఆగస్టు 31వతేదీన కన్సల్టేషన్ పేపరు విడుదల చేసింది. దీనిపై వివిధ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతో మళ్లీ తాజాగా సంప్రదింపులు ప్రారంభిస్తున్నట్లు 22వ లా కమిషన్ తెలిపింది. ఆసక్తి గలవారు 30 రోజుల్లోగా లా కమిషన్ మెంబర్ సెక్రటరీకి మెయిల్ ద్వారా అభిప్రాయాలు పంపించాలని లా కమిషన్ కోరింది.

MS Dhoni : వ‌చ్చే సీజ‌న్ ధోని ఆడ‌డా..? సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..?

యూనిఫాం సివిల్ కోడ్‌ అమలు చేస్తే మతం ప్రాతిపదిక కాకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తించనుంది. దత్తత, వారసత్వం అంశాల్లో వివిధ మతాలకు పర్సనల్ లా అమలు స్థానంలో ఒకే సివిల్ కోడ్ అమలు కానుంది. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు దీనిపై బిల్లు తీసుకురావచ్చని అంటున్నారు.(Before 2024 elections) 2014, 2019 సంవత్సరాల్లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఉమ్మడి పౌరస్మతిని చేర్చింది.ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తామని ప్రకటించింది దీనిలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా తయారు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో కమిటీని కూడా నియమించింది. మొత్తం మీద ఎన్నికలకు ముందే యూనిఫాం సివిల్ కోడ్ అంశంపై మళ్లీ వివాదం రాజుకోనుంది.

ట్రెండింగ్ వార్తలు