×
Ad

Telangana Assembly polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల 22వతేదీన హైదరాబాద్ కు రానుంది....

  • Published On : June 15, 2023 / 07:56 AM IST

Telangana Assembly polls

Telangana Assembly polls:తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల 22వతేదీన హైదరాబాద్ కు రానుంది.(ECI delegation to visit state) తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు జూన్ 22 నుంచి మూడు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.(poll preparedness)ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ రాజ్ గురువారం పోలీసు డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్, జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

Manipur Minister Residence Burned: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..మంత్రి ఇల్లు దహనం

కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు, ఈసీ సీనియర్ అధికారులు జూన్ 22, 23,24 తేదీల్లో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ, స్పెషల్ పోలీసు నోడల్ అధికారులతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు. కేంద్ర ఈసీ అధికారులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆదాయపు పన్నుశాఖ, ఎన్సీబీ, ఎక్సైజ్ డిపార్టుమెంట్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, బ్యాంకర్లు, డీఆర్ఐ, ఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల ఏర్పాటుతోపాటు ఎన్నికల సిబ్బందిని సమాయత్తం చేయనున్నారు.ఒకవైపు తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు జరుగుతుండగా, మరో వైపు రాజకీయ పక్షాలు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ వచ్చినట్లయింది.