Bengal Panchayat Polls: పోలింగ్ కంటే ముందు మొదలైన ఫైటింగ్.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కార్యకర్తలతో ఘర్షణలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మృతి

రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలంటే అల్లర్లు.. అల్లర్లంటే ఎన్నికలు అన్నట్లు ఉంటుంది పరిస్థితి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రారంభమైన రోజు నుంచే అధికార, విపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. కత్తులు, బాంబులు కూడా ఈ అల్లర్లలో ప్రధాన పాత్రే వహిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారం ముగిసి రెండు రోజులైంది. గత రెండు రోజులుగా వాతావరణం కాస్త కుదుటపడ్డట్టే అనిపించినప్పటికీ.. శనివారం పోలింగ్ ప్రారంభం కాకముందే రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమయ్యాయి.

Tamim Iqbal : గురువారం రిటైర్మెంట్.. శుక్ర‌వారం ప్ర‌ధానితో భేటీ.. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్న స్టార్ క్రికెట‌ర్‌

అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు విపరీతంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన అల్లర్లు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కపస్దంగ ప్రాంతంలో బాబర్ అలీ అనే టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. ఇక రెజినగర్ ప్రాంతంలో బాంబు దాడి జరగడంతో ఒక కార్యకర్త మృతి చెందాడు. ఖరగ్రాం ప్రాంతంలో ఒక టీఎంసీ కార్యకర్తను కత్తితో పొడిచి చంపారు. ఇక రాంపూర్ ప్రాంతంలో గణేష్ సర్కార్ అనే టీఎంసీ కార్యకర్తను పొడిచి చంపారు.

PM Modi Warangal Tour: 29ఏళ్ల తరువాత..! ఓరుగల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ .. టూర్ షెడ్యూల్ ఇలా..

రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి. 22 జిల్లా కౌన్సిళ్లు, 9,730 బ్లాక్ కౌన్సిళ్లు, 63,229 గ్రామాల్లో జరుగుతున్న పోలింగులో 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జులై 11వతేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు