Tamim Iqbal : గురువారం రిటైర్మెంట్.. శుక్ర‌వారం ప్ర‌ధానితో భేటీ.. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్న స్టార్ క్రికెట‌ర్‌

బంగ్లాదేశ్ స్టార్ క్రికెట‌ర్ త‌మీమ్ ఇక్భాల్ గురువారం అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రిని షాక్‌కు గురి చేశాడు. అయితే.. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే అత‌డు త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు.

Tamim Iqbal : గురువారం రిటైర్మెంట్.. శుక్ర‌వారం ప్ర‌ధానితో భేటీ.. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్న స్టార్ క్రికెట‌ర్‌

Tamim Iqbal reverses retirement

Tamim Iqbal reverses retirement : బంగ్లాదేశ్ స్టార్ క్రికెట‌ర్ త‌మీమ్ ఇక్భాల్ (Tamim Iqbal ) గురువారం అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్న‌ట్లు అక‌స్మాతుగా ప్ర‌క‌టించి అంద‌రిని షాక్‌కు గురి చేశాడు. అయితే.. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే అత‌డు త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. అందుకు ప్ర‌ధాన కార‌ణం బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా(Sheikh Hasina).

శుక్రవారం మధ్యాహ్నం ఢాకాలోని ప్ర‌ధాని నివాసానికి తమీమ్ ఇక్భాల్‌, అతడి భార్య, మాజీ కెప్టెన్ మోర్తజా, BCB అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌లతో కలిసి వెళ్లారు. ప్ర‌ధాని షేక్ హ‌సీనాతో వీరు భేటీ అయ్యారు. అనంత‌రం సాయంత్రం త‌మీమ్ ప్ర‌ధాని నివాసం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ.. త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు చెప్పాడు. అయితే.. వెంట‌నే క్రికెట్ ఆడ‌న‌ని, ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకుని ఆ త‌రువాత‌నే మ్యాచ్‌లు ఆడ‌నున్న‌ట్లు తెలిపాడు.

Ashes 2023 : టెస్టుల్లో 10వ సారి జో రూట్ ను ఔట్ చేసిన క‌మిన్స్‌.. ఆసీస్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

‘ప్రధాన మంత్రి ఈ మధ్యాహ్నం నన్ను తన నివాసానికి ఆహ్వానించారు. మేము సుదీర్ఘంగా చర్చించాము. ఆ తర్వాత ఆమె నన్ను క్రికెట్‌కు ఆడాల‌ని సూచించింది. నేను నా రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నాను.’ అని త‌మీమ్ చెప్పాడు. ‘నేను ఎవరికైనా నో చెప్ప‌గ‌ల‌ను. అయితే.. దేశంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తికి నో చెప్పడం అసాధ్యం. బీసీబీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నప్పుడు మష్రఫే మొర్తజా నాకు ఫోన్ చేశాడు. వారు పెద్ద కారకులు (నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో).’ అని త‌మీమ్ అన్నాడు.

ప్ర‌పంచ క‌ప్‌కు మూడు నెల‌ల ముందు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం త‌గ‌ద‌ని ప్ర‌ధాని సూచించారు. కనీసం వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కైనా ఆడాల‌న్నారు. మాన‌సికంగా కుదుట‌ప‌డాల‌ని ప్ర‌ధాని నాకు నెల‌న్న‌ర రోజులు విరామం ఇచ్చారు. ఆ త‌రువాత‌నే క్రికెట్ ఆడ‌మ‌న్నార‌ని త‌మీమ్ చెప్పాడు.

MS Dhoni long hair : నాటి పాకిస్తాన్ అధ్య‌క్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోని ఎందుకు మార్చాడు..?

బంగ్లాదేశ్ ప్ర‌స్తుతం ఆఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్ ఆడుతోంది. మొద‌టి వ‌న్డే ముగియ‌గానే కెప్టెన్ అయిన త‌మీమ్ రిటైర్‌మైంట్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నా కూడా నెల‌న్న‌ర రోజులు ఆడ‌న‌ని చెప్ప‌డంతో జూలై 8, 11 తేదీల్లో జ‌ర‌గ‌నున్న రెండో, మూడో వ‌న్డేల‌కు లిట‌న్ దాస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

బంగ్లాదేశ్ త‌రుపున త‌మీమ్ ఇక్భాల్ 70 టెస్టులు, 241 వ‌న్డేలు, 78 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 5,134 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 సెంచ‌రీలు, 31 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 8,313 ప‌రుగులు చేశాడు. ఇందుల్లో 14 శత‌కాలు, 56 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. టీ20ల్లో 7 హాప్ సెంచ‌రీల సాయంతో 1758 ప‌రుగులు చేశాడు. కాగా.. బంగ్లాదేశ్ త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా త‌మీమ్ ఇక్భాల్ ఉన్నాడు.

ICC World Cup 2023 : ప్ర‌పంచ‌కప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇవే.. టీమిండియా ఆడే మ్యాచ్‌ల అప్‌డేట్‌ షెడ్యూల్..