Had Congress not been in picture, AAP would have formed government says AAP leader Isudan Gadhvi
Gujarat Polls: గుజరాత్ రాష్ట్రంలో నెగ్గుకు వచ్చేంత సీన్ కాంగ్రెస్ పార్టీకి లేదని, గుజరాత్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ఆమ్ ఆద్మీ పార్టీ జోస్యం చెబుతోంది. పంజాబ్లో ఘనమైన విజయం సాధించి దూకుడుమీదున్న ఆప్.. గుజరాత్లో సైతం పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు తరుచు వస్తూ పోతూ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో కూడా ఆప్ గురించి బాగానే చర్చ సాగుతున్నట్లు సమాచారం.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాద్వి శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోయిందని, ఇక ఆ పార్టీని ప్రజలు పట్టించుకోరని అన్నారు. గుజరాత్లో బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని, కాషాయ పార్టీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని గాద్వి అన్నారు.
గుజరాత్ ఓటర్లను ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ణప్తికి సంబంధించిన వీడియోను చూపిస్తూ ‘‘గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని. కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతల్ని గెలిపించారు. కానీ వారు గెలవగానే బీజేపీలోకి వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల్ని గెలిపించినా అదే జరుగుతుంది. కానీ గుజరాతీ ఓటర్లు అలా చేయరు. బీజేపీని ఓడించాలని వాళ్లు అనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించబోతున్నారు’’ అని అన్నారు.
RBI Letter to Govt: దేశంలో అధిక ద్రవ్యోల్బణానికి గల కారణాలు వెల్లడించిన ఆర్బీఐ కమిటీ