RBI Letter to Govt: దేశంలో అధిక ద్రవ్యోల్బణానికి గల కారణాలు వెల్లడించిన ఆర్బీఐ కమిటీ

అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవట. వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్‌లో అప్పర్ రేంజ్‌ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ కమిటీ పంపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది

RBI Letter to Govt: దేశంలో అధిక ద్రవ్యోల్బణానికి గల కారణాలు వెల్లడించిన ఆర్బీఐ కమిటీ

Ukraine war may be at centre of RBI letter to govt

RBI Letter to Govt: దేశంలో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరింది. ఇలా ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ వెల్లడించింది. అంతర్జాతీయ అంశాల ప్రభావం వల్లే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని సాధించలేకపోయినట్లు ఆర్బీఐ కమిటీ తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండటంతో ఇంధనం, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాల ధరలు పెరిగాయని.. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి సమయంలో ఏర్పడ్డ అంతరాయాలు ప్రభావితం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ ఓ లేఖ రాసినట్లు సమాచారం.

Amruta Fadnavis: గవర్నర్ కోశ్యారిపై మహారాష్ట్ర మండిపడుతుంటే.. వెనకేసుకొచ్చిన ఫడ్నవీస్ సతీమణి

అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవట. వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్‌లో అప్పర్ రేంజ్‌ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ కమిటీ పంపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని బహిరంగ పర్చాల్సి అవసరం ప్రభుత్వానికి లేనందున దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాకపోతే, ధరలకు కళ్లెం వేయలేకపోవడానికి కారణాలను ఆర్బీఐ వివరించాలని చట్టం చెప్తోంది. ఆర్థికవేత్తలు వేసిన అంచనా ప్రకారం ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉంది.

Rajasthan: పని చేసిన డబ్బులు ఇమ్మన్నందుకు దళిత వ్యక్తిపై దాడి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి..