Amruta Fadnavis: గవర్నర్ కోశ్యారిపై మహారాష్ట్ర మండిపడుతుంటే.. వెనకేసుకొచ్చిన ఫడ్నవీస్ సతీమణి

నంబర్ 19న ఔరంగాబాద్‭లోని బాబాసాహేబ్ అంబేద్కర్ మరట్వాడ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ మాట్లాడుతూ ‘‘మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్‭గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‭నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్.

Amruta Fadnavis: గవర్నర్ కోశ్యారిపై మహారాష్ట్ర మండిపడుతుంటే.. వెనకేసుకొచ్చిన ఫడ్నవీస్ సతీమణి

Fadnavis' Wife Backs Governor Amid Row Over Shivaji Remark

Amruta Fadnavis: ఛత్రపతి శివాజీ మహరాజ్‭పై చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర మొత్తంగా ఆయనపై మండిపడుతుంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మాత్రం ఆయనను వెనకేసుకు రావడం గమనార్హం. కోశ్యారి మరాఠీని బాగా గౌరవిస్తారని, ఆయనేదో అన్నారని వక్ర భాష్యాలు వెతకొద్దంటూ ఆమె హితవు పలికారు.

‘‘నాకు ఆయన వ్యక్తిగతంగా బాగా తెలుసు. మహారాష్ట్రకు వచ్చాక ఆయన మరాఠీ నేర్చుకున్నారు. ఆయనకు మరాఠీ అంటే చాలా ప్రేమ కూడా. నా అనుభవం నుంచి ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనేదో అన్నారని చాలా సందర్భాల్లో వక్రభాష్యాలు వెతికారు. ఇలా చాలా సార్లు జరిగింది. కానీ ఆయన మనసులో మరాఠీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది’’ అని అమృత ఫడ్నవీస్ అన్నారు.

నంబర్ 19న ఔరంగాబాద్‭లోని బాబాసాహేబ్ అంబేద్కర్ మరట్వాడ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ మాట్లాడుతూ ‘‘మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్‭గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‭నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎవరైనా కొత్త వ్యక్తుల్ని రోల్ మోడల్‭గా ఎంపిక చేసుకోండి’’ అని అన్నారు.

గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఈ విషయమై శివసేన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ కోశ్యారీని తొలగించాలంటూ డిమాండ్ చేస్తోంది. అలాగే ముఖ్యమంత్రి షిండే సైతం రాజీనామా చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది.

Maha vs Karnataka: ఇది సమాఖ్య దేశం, ప్రతి రాష్ట్రానికి సొంత హక్కులు ఉంటాయి.. కర్ణాటక సీఎం బొమ్మై