kiccha sudeep
Sudeep: కన్నడ రాజకీయాల్లో సినీ గ్లామర్ కొంచెం తక్కువగా ఉంటుంది. తమిళనాట, తెలుగునాట ఈ ప్రభావం కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ.. కర్ణాటకకు అంత పెద్దగా అంటుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు సినీ స్టార్లు రాజకీయాల్లో పోటీ చేశారు. కొందరేమో కొన్ని సార్లు క్యాంపెయిన్ చేశారు. కానీ, అది రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకునేంత చర్చలో అయితే ఎప్పుడూ లేదు. అయితే ఈసారి అలా కాదు.. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్.. ఎంట్రీతో కన్నడ రాజకీయానికి కావాల్సినంత సినీ గ్లామర్ యాడయ్యేలాగే ఉంది.
Tamil Nadu : తమిళనాడు ధర్మలింగేశ్వర ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. వాటర్ ట్యాంక్ లో పడి ఐదుగురు మృతి
అంటే.. సుదీప్ ఏమీ రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయాలు చేస్తా అని కూడా చెప్పడం లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. అది కూడా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కోసం. అంతకు మించి తాను బీజేపీలో చేరనని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టతనిచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం బొమ్మైతో కలిసి సుదీప్ మాట్లాడారు.
Supreme Court : మీడియావన్ ఛానల్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్
‘‘నేను కేవలం బీజేపీ కోసం ప్రచారం చేస్తాను. కానీ ఎన్నికల్లో పోటీ చేయను. పార్టీలో కూడా చేరడం లేదు. సీఎం బొమ్మై కోసం ఏదైనా చేస్తాను. ఆయనకు మద్దతు ఇచ్చానంటే.. ఆయన సూచించిన వారందరికీ కూడా మద్దతు ఇచ్చినట్టే. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను’’ అని కిచ్చా అన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా మద్దతు ఇచ్చినట్టేనా అని ప్రశ్నించగా.. ‘‘ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నాకు సానుకూల అభిప్రాయం ఉంది. అయితే నేనిక్కిడ (బీజేపీకి మద్దతుగా) కూర్చోవడానికి దానికి సంబంధం లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.