Minister Harish Rao: పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు.. బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దు ..
టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారు. ప్రశాంత్‌కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.

Minister Harish Rao Press Meet
Minister Harish Rao: బీఆర్‌ఎస్‍ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిన్న బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయటపడిందన్నారు. అయినా, బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ, రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని, భవిష్యత్ తరాలకు బీజేపీ ఏం సందేశం ఇవ్వదలుచుకుందని మంత్రి ప్రశ్నించారు. బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా బుకాయిస్తున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలని హరీష్ రావు సూచించారు.
Bandi Sanjay Arrest : బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్
పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని హరీష్ అన్నారు. తాండూరులో లీకేజీకి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీలో ఉన్నారు. ప్రశాంత్‌కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయని హరీష్ అన్నారు. నిన్న మధ్యాహ్నం పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసిందని, సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసిందని, బీజేపీకి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందని, అయినా, నడ్డా సంజయ్‌ను సమర్ధించడం సిగ్గు చేటని అన్నారు.
Somu Veerraju: బండి సంజయ్ అరెస్ట్ పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు.. డబ్బు సంపాదించాలనే..
సంజయ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేయ దలుచుకున్నా. పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా? ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని నీకు వాట్సాప్‌లో పంపింది నిజమా కాదా?, రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడింది నిజమా కాదా, పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను మీడియా గ్రూపులకు, వెబ్సైట్‌లకు మీ ప్రోద్భలంతో పంపింది నిజం కాదా? ప్రశ్నాపత్రం వ్యాప్తిలో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావ్? రోజుకో ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వ్యాప్తిచేయించాలని నీవు కుట్ర పన్నింది నిజం కాదా? సోషల్ మీడియాలో ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది బీజేపీ కార్యకర్తలు కాదా.. అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.
Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
ప్రశ్నా పత్రాలు నిందితుడు మీకు పంపితే తప్పేమిటని మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ప్రశ్న పత్రం మీకు 11.20 కి పంపానని నిందితుడు చెప్పారు. వాట్సాప్ రికార్డుల్లో కూడా ఉంది. పదో తరగతి పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు.. ఈ మధ్యలో ఎవరు ఎవరికి షేర్ చేసినా అది నిబంధనలకు విరుద్ధమని తెలియదా అని హరీష్ రావు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లాగా మీ గుండా గిరి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం, కేసీఆర్ ముందు నీ పప్పులు ఉడకవని హరీష్ అన్నారు. బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దని హరీష్ రావు సూచించారు. బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరుతున్నామన్నారు.