Munugodu in Telangana and Adampur by-elections in Haryana have the same reason
Bypolls: తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి హర్యానాలోని అదాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నికలకు కారణం ఒకటే. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు.. తమ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ఈ రెండు చోట్ల ఉప ఎన్నిక అనివార్యమైంది.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. రాజకీయ, ఇతరత్రా కారణాల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ఏర్పడింది. ఇక హర్యానా విషయానికి వస్తే అదాంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి సైతం పార్టీ మారారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. మూడేళ్లు కూడా గడవక ముందే పార్టీ వీడి బీజేపీలో చేరారు.
అయితే ఈ రెండు ఉప ఎన్నికలు ఒకే కారణంతో ఏర్పడినప్పటికీ.. ఈ రెండు ప్రాంతాల్లో ఒకే రకమైన పోటీ లేదు. అదాంపూర్ నియోజకవర్గంలో బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీగా తలపడుతున్నప్పటికీ.. మునుగోడులో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం తప్పదని అంటున్నారు.
Bypolls: నితీశ్, తేజస్వీ కూటమికి తొలి పరీక్ష.. ఉన్న ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోంది?