Bypolls: నితీశ్, తేజస్వీ కూటమికి తొలి పరీక్ష.. ఉప ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోంది?

నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్‭లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేపీకి పోటీగా ఆర్జేడీ పోటీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ ప్రభావం చూపితే బీజేపీ దూకుడుని నిలువరించి జేడీయూ-ఆర్జేడీ కూటమిపై రాష్ట్రంలో విశ్వాసం కల్పించొచ్చు

Bypolls: నితీశ్, తేజస్వీ కూటమికి తొలి పరీక్ష.. ఉప ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోంది?

First test for Nitish and Tejashwi alliance

Bypolls: భారతీయ జనతా పార్టీకి టాటా చెప్పిన అనంతరం.. జేడీయూ-ఆర్జేడీ నేతృత్వంలో బిహార్‭లో కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం.. ఇటు జేడీయూ, ఆర్జేడీ.. అటు బీజేపీ రాజకీయంగా పరస్పరం అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేకం కొనసాగాయి. మోసాలు, దగాలు వంటి అనేక పదాలు దొర్లాయి. ప్రజలు తమవైపే అంటే, తమ వైపే అని ఏవేవో కారణాలు చెప్పుకున్నారు. అయితే రాజకీయ పార్టీల మధ్య ఎన్ని పరస్పర విమర్శలు ఉన్నప్పటికీ.. ఏ పార్టీ వైపు ప్రజలు విశ్వాసంగా ఉన్నారనేదానికి ఎన్నికలే అసలు పరీక్ష.

కాగా నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్‭లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేపీకి పోటీగా ఆర్జేడీ పోటీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ ప్రభావం చూపితే బీజేపీ దూకుడుని నిలువరించి జేడీయూ-ఆర్జేడీ కూటమిపై రాష్ట్రంలో విశ్వాసం కల్పించొచ్చు. లేదంటే రాజకీయ లబ్ది కోసం ఏర్పడ్డ ప్రభుత్వంగా నితీశ్-తేజస్వీ కూటమి అవమానం మూటకట్టుకోక తప్పదు. ఇప్పటికే రాష్ట్రంలో జోరుమీద ఉన్న బీజేపీ.. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థుల్ని ఓడగొట్టి నితీశ్‭ను చావు దెబ్బ కొట్టాలని చూస్తోంది. అయితే బీజేపీ ప్రయత్నాలు నీటి మూటలే అని నిరూపించడానికి జేడీయూ-ఆర్జేడీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో తెలియాలంటే 6వ తేదీన ఫలితాలు వచ్చే వారకు ఆగాల్సిందే.

7 Bypolls Today: 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతోన్న పోలింగ్.. ఈ ఉప ఎన్నికలకు కారణాలేంటో తెలుసా?