PM Modi Holds Longest Ever Roadshow In Gujarat
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఓ వైపు జరుగుతుండగా, మరో వైపు దేశంలోనే అతిపెద్ద ఎన్నికల ర్యాలీ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ. రెండో దశ పోలింగ్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 50 కిలోమీటర్లపాటు 16 నియోజకవర్గాల్లో ఈ ర్యాలీ సాగుతోంది.
Gujarat polls: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘మీసాల మనిషి’.. ప్రభుత్వం మీసాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి
1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏడోసారి అధికారం దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఈ ర్యాలీ రూట్ మ్యాప్ ఎంపికలో ఒక బలమైన ప్రకటన ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం అనంతరం జరిగిన అల్లర్లలో నరోదా గామ్ ఒకటి. ఈ ప్రాంతం నుంచే మోదీ తన 50 కిలోమీటర్ల రోడ్‌షోను ప్రారంభించారు. ఠక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వేజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతితో సహా మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో ఈ ర్యాలీ కొనసాగి గాంధీనగర్ సౌత్ నియోజకవర్గంతో ముగుస్తుంది. ఈ ర్యాలీకి మొత్తం మూడున్నర గంటల సమయం పడుతుందట.
వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన్ని మోదీ ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు. పండిట్ దిండయాళ్ ఉపాధ్యాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో సహా ప్రముఖ వ్యక్తుల స్మారక చిహ్నాలను దారి పొడవునా 35 స్టాప్‌లు ఏర్పాటు చేశారు. భారత దేశ చరిత్రలో ఇంత పొడవైన ర్యాలీ ఇదేనని బీజేపీ పేర్కొంది.
SC-ST Act: దళిత విద్యార్థులతో బలవంతంగా టాయిలెట్లు కడిగించిన ప్రిన్సిపాల్