Gujarat Polls: గ్రామాల్లోని వారికి నీళ్లు, సోడా లేకపోయినా నడిచిపోతుంది.. ఎన్నికల్లో మద్యం పంపిణీపై పబ్లిక్‭గా వాగిన ఆప్ ఎమ్మెల్యే

సౌరబ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ‘‘గ్రామాల్లో నివసించే పురుషులందరినీ మద్యానికి బానిసలుగా ఆప్ అధికార ప్రతినిధి పేర్కొనడం విస్మయకరం. ఎన్నికల మూడ్ హోలీ, దీపావళి లాంటిదని.. మద్యం తాగడం వల్లే మగవారు సెట్ అయ్యారని ఆయన అనడం దారుణం’’ అని విమర్శించారు.

Gujarat Polls: గ్రామాల్లోని వారికి నీళ్లు, సోడా లేకపోయినా నడిచిపోతుంది.. ఎన్నికల్లో మద్యం పంపిణీపై పబ్లిక్‭గా వాగిన ఆప్ ఎమ్మెల్యే

AAP MLA Encouraging Liquor Use in Villages

Gujarat Polls: మన దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మందు, మనీ పంపకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి, తుది పోలింగ్ ముగిసే వరకు వీటి స్వైర విహారం నడుస్తూనే ఉంటుంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెళ్లడించేందుక నేతలు అంగీకరించరు. ఈ రెండూ పంచని పార్టీ ఉండదు. కానీ, తాము అలాంటి తప్పుడు పనులు చేయమని అందరూ బయటికి చెప్తుంటారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఈ పని చేస్తూనే ఉంటాయి. కానీ, బయటికి మాత్రం ఏవేవో నీతులు చెప్తుంటారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం ఇలా కాకుండా నిజాన్ని నిజంగా చెప్పారు. నిక్కచ్చిగా చెప్పారు అనేకంటే, తాము చేస్తున్న పనిని పచ్చిగా ఒప్పుకున్నారనడం సబబేమో. ఎన్నికల్లో మద్యం పంపిణీని ప్రోత్సహిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.

Maha vs Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో హై-టెన్షన్.. మహా నుంచి కాదు, కన్నడ నుంచి పంపాలంటూ ఆందోళన

రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యే సౌరబ్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘కొన్ని ప్రాంతాల్లో మద్యం ఎప్పుడు పంపిణీ చేస్తున్నారో మాకు తెలుసు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు మేము చెప్పము. ఇలాంటి పనుల వల్ల ప్రజలకు ఏదైనా మంచి జరిగితే అదే విధంగా పంపిణీ చేయమని మేము కూడా చెబుతాము’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘గ్రామస్తులకు నీళ్లు, సోడా పెద్దగా అవసరం ఉండదు. వాళ్లకు ఎలా సెట్ చేయాలో తెలుసు’’ అని అన్నారు.

సౌరబ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ‘‘గ్రామాల్లో నివసించే పురుషులందరినీ మద్యానికి బానిసలుగా ఆప్ అధికార ప్రతినిధి పేర్కొనడం విస్మయకరం. ఎన్నికల మూడ్ హోలీ, దీపావళి లాంటిదని.. మద్యం తాగడం వల్లే మగవారు సెట్ అయ్యారని ఆయన అనడం దారుణం’’ అని విమర్శించారు.

Gujarat polls: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘మీసాల మనిషి’.. ప్రభుత్వం మీసాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి