Maha vs Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో హై-టెన్షన్.. మహా నుంచి కాదు, కన్నడ నుంచి పంపాలంటూ ఆందోళన

మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, టెక్స్‭టైల్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఎక్సైజ్ మంత్రి షంబూరాజ్ దేశాయి, ఎంపీ ధైర్యషీల్ మానెలో కూడిన బృందం బెళగావిలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రతినిధి బృందం షాపూర్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ గార్డెన్‌ను సందర్శిస్తుంది, తరువాత హిండల్గాలోని అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శిస్తుంది.

Maha vs Karnataka: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో హై-టెన్షన్.. మహా నుంచి కాదు, కన్నడ నుంచి పంపాలంటూ ఆందోళన

Tensions high ahead of Maharashtra ministers’ visit to parts of Belagavi

Maha vs Karnataka: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నిరాటకంగా సాగుతోంది. తాజాగా రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటించనుంది. ఈ పర్యటనను కన్నడిగులు వ్యతిరేకిస్తూ సరిహద్దు జిల్లా బెళగావిలో ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర నుంచి బృందం కర్ణాటక రావడం కాదు, కన్నడ బృందాన్నే మహారాష్ట్రకు పంపి కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేస్తున్నారు.

‘Xi Jinping, Step Down’: ‘దిగిపో జిన్‌పింగ్’ నినాదాలతో దిగొచ్చిన చైనా ప్రభుత్వం .. సీసీపీ స్టెప్‌ డౌన్‌ నినాదాలతో డ్రాగన్ సర్కార్‌లో వణుకు

ఇక సరిహద్దులోని గ్రామాల ప్రజల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోందట. ఇది మరీంత హీట్ పెంచుతోంది. మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, టెక్స్‭టైల్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఎక్సైజ్ మంత్రి షంబూరాజ్ దేశాయి, ఎంపీ ధైర్యషీల్ మానెలో కూడిన బృందం బెళగావిలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రతినిధి బృందం షాపూర్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ గార్డెన్‌ను సందర్శిస్తుంది, తరువాత హిండల్గాలోని అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శిస్తుంది. అనంతరం మహారాష్ట్ర ఏకీకరణ సమితి నాయకులను కలుస్తారు. పాఠశాలల్లో కన్నడను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన సందర్భంగా జూన్ 1, 1986 న పోలీసు కాల్పుల్లో మరణించిన వారిలో కొందరి కుటుంబాలను పరామర్శిస్తారు. వారు పాత బెళగావి, సుల్గా, ఉచ్‌గావ్, బెల్గుండి, విజయనగర్, కంగ్రాలిలను కూడా సందర్శిస్తారు.

WhatsApp Accounts Ban : భారత్‌లో ఒక్క నెలలోనే 23 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలుసా?

మహారాష్ట్రకు చెందిన ఈ బృందానికి కర్ణాటకలో పర్యటించేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కన్నడిగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో కర్ణాటక శీతాకాల సమావేశాలు బెళగావిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదం ఈ స్థాయిలో ముదరడంపై పరిణామాలు ఎటు వెళ్లనున్నాయో అంటున్నారు. మహారాష్ట్ర బృందాన్ని వ్యతిరేకిస్తూనే మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలకు కర్ణాటక నుంచి సీనియర్ మంత్రుల బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి బెళగావి జిల్లా కన్నడ సంగటనేగల క్రియా సమితి అధ్యక్షుడు అశోక్ చందర్గి లేఖ రాశారు. దక్షిణ కొల్లాపూర్ జిల్లాలోని జట్టా, అంకలకోట తదితర ప్రాంతాలను ప్రతినిధి బృందం సందర్శించాలని బొమ్మైకి రాసిన లేఖలో ఆయన కోరారు.

Gujarat Polls: కాంగ్రెస్ నేతల మధ్య ఆ పోటీ ఉంటది.. కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ కౌంటర్