‘Xi Jinping, Step Down’: ‘దిగిపో జిన్‌పింగ్’ నినాదాలతో దిగొచ్చిన చైనా ప్రభుత్వం .. సీసీపీ స్టెప్‌ డౌన్‌ నినాదాలతో డ్రాగన్ సర్కార్‌లో వణుకు

దిగిపో జిన్‌పింగ్‌.. సీసీపీ స్టెప్‌ డౌన్‌ నినాదాలతో చైనా ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఎక్కడో జెంగ్‌ ఝౌ.. గ్వాంగ్‌ ఝౌలో మొదలైన నిరసనలు.. ఒక్కో నగరాన్ని తాకుతూ.. చివరకు ఆర్థిక రాజధాని షాంఘై వరకూ వచ్చేయడంతో.. అప్పటి వరకూ చలనం లేని చైనా సర్కార్‌.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జస్ట్‌.. కొద్దిరోజుల్లోనే.. నిరసనలు దేశంలోని ప్రధాన నగరాలను దావానలంలా చుట్టుముట్టేయడంతో డ్రాగన్‌ కంట్రీ డౌన్‌ అయింది.

‘Xi Jinping, Step Down’: ‘దిగిపో జిన్‌పింగ్’ నినాదాలతో దిగొచ్చిన చైనా ప్రభుత్వం .. సీసీపీ స్టెప్‌ డౌన్‌ నినాదాలతో డ్రాగన్ సర్కార్‌లో వణుకు

China anti-COVID Protests..Xi Jinping

‘Xi Jinping, Step Down’: కాబోయే వరల్డ్ నెంబర్‌వన్‌ మేమే అంటూ జబ్బలు చరిచిన డ్రాగన్‌.. స్టూడెంట్స్‌ నిరసనలతో భయపడిపోతోంది. తమకు తిరుగు లేదు.. ఎదురు అసలే లేదనుకున్న ఎ్రరదండును.. ఓ తెల్లకాగితం ఇప్పుడు వణికిస్తోంది. చైనాలో నియంతృత్వ పరిపాలనతో పట్టుబిగించిన జిన్‌పింగ్‌కు చెమటలు పట్టించేలా ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. దానికి నిదర్శనమే.. యూనివర్సిటీలను ఖాళీ చేయించడం.. అసలు చైనాలో ఏం జరుగుతోంది. విద్యార్థులందర్నీ ఇళ్లకు ఎందుకు పంపించేయాల్సి వస్తోంది.. ?

దిగిపో జిన్‌పింగ్‌.. సీసీపీ స్టెప్‌ డౌన్‌ నినాదాలతో చైనా ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఎక్కడో జెంగ్‌ ఝౌ.. గ్వాంగ్‌ ఝౌలో మొదలైన నిరసనలు.. ఒక్కో నగరాన్ని తాకుతూ.. చివరకు ఆర్థిక రాజధాని షాంఘై వరకూ వచ్చేయడంతో.. అప్పటి వరకూ చలనం లేని చైనా సర్కార్‌.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జస్ట్‌.. కొద్దిరోజుల్లోనే.. నిరసనలు దేశంలోని ప్రధాన నగరాలను దావానలంలా చుట్టుముట్టేయడంతో డ్రాగన్‌ కంట్రీ డౌన్‌ అయింది. ఆ నిరసనలు అలాగే కొనసాగితే.. తిరుగుబాటు తప్పదని భావించిందేమో.. కాళ్లబేరానికి దిగొచ్చింది. వెనక్కు తగ్గామని నేరుగా ఒప్పుకోలేక.. కోవిడ్‌ ఆంక్షలను సడలిస్తూ నిరసనలు చల్చార్చే ప్రయత్నం చేస్తోంది.

అయినా.. నిరసనలు ఇప్పట్లో చల్లారేలా కనిపించకపోవడంతో.. డ్రాగన్‌ తప్పనిసరి చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా నిరసనలు.. సోషల్‌ మీడియా ఉద్యమంలో స్టూడెంట్స్‌దే మెయిన్‌ రోల్‌ అని గుర్తించిన చైనా ప్రభుత్వం.. యూనివర్సిటీలపై దృష్టి పెట్టింది. యూనివర్సిటీలను ఖాళీ చేయిస్తే.. సగం నిరసనలు తగ్గిపోతాయని భావించిన జిన్‌ పింగ్ సర్కార్‌.. కోవిడ్ రక్షణ చర్యల పేరుతో వర్సిటీలను ఖాళీ చేయించేందుకు పూనుకుంది. క్లాసులు.. పరీక్షలు.. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామంటూ ఎలాగైనా స్టూడెంట్స్‌ను ఇళ్లకు పంపిస్తోంది. స్టూడెంట్స్‌ ఇళ్లకు వెళ్లేందుకు.. ఆఖరికి బస్సులను కూడా పురమాయిస్తోంది డ్రాగన్‌. విద్యార్థులను వర్సిటీల నుంచి ఫ్రీ బస్సుల్లో.. రైల్వేస్టేషన్లలో దిగబెడుతోంది.

మరోవైపు సోషల్‌ మీడియాలో నిరసనల ఫొటోలు.. హ్యాష్‌ట్యాగ్‌లు.. ఆందోళనలకు సంబంధించిన సమాచారం ట్రాన్స్‌ఫర్‌ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే వీబో.. వుయ్‌చాట్ వంటి సోషల్‌ మీడియా యాప్‌లను నియంత్రిస్తోన్న చైనా.. ఫుట్ బాల్‌ ప్రసారాలను కూడా కంట్రోల్‌లోకి తీసుకుంది. చైనాలో వుయ్‌ వాంట్ ట్రాన్స్‌పరెన్సీ నినాదంతో కేవలం తెల్లకాగితంతో నిరసనలు ఉధృతమయ్యాయి. కాగితంపై ఏమీ రాయకుండానే తాము ఏం కావాలనుకుంటున్నామో చెప్పేస్తున్నారు నిరసనకారులు. జిన్‌ పింగ్ సర్కార్‌ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తెల్లకాగితం ఉద్యమం.. ఎంతలా ఉందంటే.. పేపర్‌ తయారీ కంపెనీ ఏ4 పేపర్లు అమ్మడం ఆపేసిందన్న ప్రచారం కూడా మొదలైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గత మూడేళ్లుగా కోవిడ్‌ ఆంక్షలతో విసిగి వేసారిపోయిన చైనా జనం.. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. చిన్నచిన్న పనులు.. ఉద్యోగులు ఎక్కువగా ఉండే గ్వాంగ్ ఝౌ షట్ డౌన్‌ చేయడంతో.. బతుకుదెరువు పోయి.. మూడు పూటలా తినలేని పరిస్థితి తలెత్తడంతో ఆగ్రహ జ్వాలలు రేగాయి. పోయిన వారం.. ఉరుంకి టౌన్‌లోని అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఫైర్‌ యాక్సిడెంట్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆగ్రహం తెప్పించింది. కోవిడ్ ఆంక్షల పేరుతో అపార్ట్‌మెంట్‌ని లాక్‌ చేయడం వల్లే ఆ పది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని జనం భగ్గుమన్నారు. దీంతో నిరసనలు.. ఏకంగా అధికార పీఠాన్నే వణికిస్తున్నాయి. జిన్‌పింగ్‌ దిగిపోవాల్సిందేనంటూ ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తుండడంతో వారిని అణిచివేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా అధికార పార్టీ.