Congress chief Mallikarjun Kharge
Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల పోలింగుకు మరో నాలుగు రోజుల సమయం ఉంది. కానీ కాంగ్రెస్ అధినేత మల్లికర్జున ఖర్గే అప్పుడే ఓటమి బాధ్యతను తీసుకున్నారు. అంతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడుతుందని చెప్పలేదు కానీ, ఒకవేళ ఓడితే అందుకు పూర్తి బాధ్యత తానే వహిస్తానని అన్నారు. శుక్రవారం ఇండియా టుడేకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇండియా టుడే విలేకరి కాంగ్రెస్ ఓటమి గురించి ప్రశ్నించగా.. ‘‘నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలనే బలంగా కోరుకుంటున్నాను. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ఎన్నికల్లో ఓడితే అందుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను’’ అని ఖర్గే సమాధానం ఇచ్చారు.
Maharashtra Politics: హైడ్రామా అనంతరం రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఇక ఫలితాలు 13వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన్ మ్యాన్ షో చేస్తుండగా.. కాంగ్రెస్ తరపున మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని మెజారిటీ సర్వేలు వెల్లడించాయి.