Assembly Elections 2023: బీజేపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోన్న రెబల్స్.. రెండో జాబితాకు ముందే మళ్లీ రగడ

తొలిజాబితాలో టిక్కెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రెండో జాబితాకు ముందు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలోనే పలువురు అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది

Rajasthan BJP Candidate List: రాజస్థాన్‌లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో మళ్లీ కలకలం మొదలైంది. రెండో జాబితా విడుదల కాక ముందే ఈ రగడ ప్రారంభమైంది. శుక్రవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో రాజస్థాన్ కోర్ కమిటీ నేతల సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. దీని తర్వాత శనివారం నాటికి బీజేపీ జాబితా వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాలో కూడా కేంద్రమంత్రితో సహా ముగ్గురు ఎంపీలను పార్టీ బరిలోకి దించవచ్చు.

ఈమేరకు గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ కోర్ కమిటీ నేతలతో తెలంగాణ జాబితాపై మారథాన్ సమావేశం నిర్వహించారు. మరోవైపు, రాజస్థాన్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్లో అర్థరాత్రి వరకు రాజస్థాన్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి షా శుక్రవారం ఉదయం రాజస్థాన్ నేతలతో చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: కాంగ్రెస్‭కు ఎస్పీకి చెడిందా? 2024 ఎన్నికలపై పెద్ద ప్రకటనే చేసిన శివపాల్ యాదవ్

రెండో జాబితాలో దాదాపు 70 నుంచి 80 మంది పేర్లు ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేర్లపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది. ఈ జాబితాలో కొత్త ముఖాలకు కూడా బీజేపీ అవకాశం కల్పించవచ్చు. జాబితాలో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 45 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలను డీ కేటగిరీలో ఉంచింది బీజేపీ. వీటిలో 11 స్థానాల్లో బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.

తొలిజాబితాలో టిక్కెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రెండో జాబితాకు ముందు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలోనే పలువురు అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తిని ఆపేందుకు పార్టీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. కొన్ని సీట్లలో కూడా మార్పులు ఉండొచ్చని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Kerala High Court : మహిళలు తమ అమ్మ,అత్తగార్లకు బానిసలు కాదు : జడ్జి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు