Kerala High Court : మహిళలు తమ అమ్మ,అత్తగార్లకు బానిసలు కాదు : జడ్జి కీలక వ్యాఖ్యలు

మహిళలు వారి అమ్మలకు, అత్తగార్లకు బానిసలు కాదు అంటూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kerala High Court : మహిళలు తమ అమ్మ,అత్తగార్లకు బానిసలు కాదు : జడ్జి కీలక వ్యాఖ్యలు

Kerala HC justice Devan Ramachandran

Kerala HC justice Devan Ramachandran : మహిళలు వారి అమ్మలకు, అత్తగార్లకు బానిసలు కాదు అంటూ కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ విడాకుల కేసు విచారణ సందర్భంగా గురువారం (అక్టోబర్ 19,2023) జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తప్పుపట్టింది. ఇటువంటి తీర్పులు పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహిళల నిర్ణయాలు వారికంటే తక్కువేమీ కాదని స్పష్టం చేశారు. మహిళలు వారి అమ్మలకు, అత్తమ్మలకు బానిసలు కారు అంటూ జస్టిస్ దేవన్ పేర్కొనటం గమనించాల్సిన విషయం.

ఓ మహిళ విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు కొట్టి వేసింది. దీన్ని సదరు బాధిత మహిళ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఓ పక్క అభ్యంతరం వ్యక్తం చేస్తునే..మరో పక్క వివాహ పవిత్రతకు అనుగుణంగా తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని సదరు జంటకు సూచించారు.

World Most Valuable whisky : ప్రపంచంలో ఖరీదైన స్కాచ్ విస్కీ .. ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!

బాధిత మహిళ విషయంలో ఆమె తన అమ్మ, అత్తమ్మ చెప్పేది వినాలంటూ కుటుంబ న్యాయస్థానం చెప్పిన విషయాన్ని భర్త తరఫు న్యాయవాది ప్రస్తావించగా..జస్టిస్ దేవన్ ‘‘ఇది పితృస్వామ్య వ్యవస్థలాంటిదని..ఇది ఈరోజుల్లో ఉండాల్సినది కాదు’’ అని అన్నారు. ఇటువంటి విషయాలు వారు కోర్టు బయటే పరిష్కరించుకునేవి అంటూ పేర్కొన్నారు.