By Polls: కఠిన భద్రత నడుమ నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

అరుణాచల్ ప్రదేశ్‭లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్‌లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజేపీ త్సెరింగ్ లాముని రంగంలోకి దించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలిచే అవకాశం ఉందని దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ తేల్చి చెప్పాయి

By Polls: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, అరుణాల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ఉప ఎన్నిక జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో కఠిన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి 2నే వస్తాయి.

Dharmapuri Srinivas: పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

తమిళనాడులో ఈరోడ్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్‭లోని లుమ్లా, పశ్చిమ బెంగాల్‭లోని సాగర్దిఘి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మరణం వల్ల ఉప ఎన్నిక ఏర్పడింది. ఈరోడ్ ఈస్ట్ నుంచి తిరుమాహన్ ఎవెరా, లుమ్లా నుంచి జాంబే తాషి, ఇక సార్దిఘి నుంచి సుబ్రతా సాహ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే వీరి మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. ఇక జార్ఖండ్‭లోని రామగఢ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మమతా దేవి మీద అనర్హత వేటు పడడంతో ఉప నిర్వహించాల్సి వచ్చింది.

Meghalaya, Nagaland Assembly Polling 2023: మధ్యాహ్నం 1గంట వరకు మేఘాలయలో 44.7శాతం, నాగాలాండ్‌లో 57శాతం ఓటింగ్.. Live Updates

తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, ఏఐడీఎంకే మధ్యే ఉంటుందని అంటున్నారు. పొత్తు కారణంగా పోటీ నుంచి తప్పుకున్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‭లోని సాగర్దిఘి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్-కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

AAP Protests : మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆప్ నిరసనలు.. బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నం

అరుణాచల్ ప్రదేశ్‭లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్‌లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజేపీ త్సెరింగ్ లాముని రంగంలోకి దించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలిచే అవకాశం ఉందని దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ తేల్చి చెప్పాయి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నాయకుడిని కాల్చి చంపడంతోపాటు 405 బూత్‌లలో 144 హైపర్‌సెన్సిటివ్‌గా ప్రకటించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 18 మంది పోటీలో ఉంటే అందులో 14 మంది స్వతంత్ర అభ్యర్థులే. ఇక ఈ స్థానంలో అధికార పార్టీ జేఎంఎం మిత్రపక్షమైన కాంగ్రెస్, అలాగే బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్‭యూ మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు