Former CM Arjun Singh: కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నా ఒక్కరోజే సీఎం.. ఆ మాజీ సీఎం గురించి ఎంత మందికి తెలుసు?

బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించాలనే కోరికను తన తండ్రితో చెప్పినప్పుడు, తన భార్యను అడగమని తన తండ్రి చెప్పాడని డాక్టర్ జోషి తన పుస్తకంలో రాశారు. తన తండ్రి శివ బహదూర్ సింగ్ మాటలు విన్న అర్జున్ సింగ్ కి సినిమా మీద కోరిక తీరిపోయింది.

Assembly Elections 2023: దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సింగ్ గురించి నేటి తరానికి దాదాపు తెలియదు. ఆయన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథనాలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మధ్యప్రదేశ్‌లో రెండుసార్లు అధికార పీఠాన్ని అధిష్టించిన అర్జున్‌ సింగ్‌.. రాజకీయాల్లోకి రావాలనుకోలేదని సీనియర్‌ జర్నలిస్టు డాక్టర్‌ రాంశరణ్‌ జోషి తన పుస్తకం ‘అర్జున్‌ సింగ్‌: ఎ కంపానియన్స్‌ హిస్టరీ’లో చెప్పారు. ఆయన సినిమాలలో పనిచేయాలని కోరుకున్నారట, నటనా ప్రపంచంలో పేరు సంపాదించాలనేది ఆయన ఆసక్తని పేర్కొన్నారు.

కాలేజీ రోజుల్లో అర్జున్ సింగ్‌కి ఒక సన్నిహిత మిత్రడు ఉండేవాడు. ఆయన పేరు ప్రేమనాథ్. బాలీవుడ్‌లో ప్రేమనాథ్ ప్రముఖ సినీ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అర్జున్ సింగ్, ప్రేమ్‌నాథ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమనాథ్ తండ్రి రేవాలో ఐజీగా ఉండేవారు. బాలీవుడ్ షోమ్యాన్ రాజ్ కపూర్ కూడా ప్రేమనాథ్ సోదరిని రేవాలో వివాహం చేసుకున్నారు. కాలేజీలో కూడా సినిమాల చర్చలు చాలా హాట్‌గా ఉండేవి. దీని వల్ల అర్జున్ సింగ్ కూడా బొంబాయి (ఇప్పుడు ముంబై) వెళ్లి సినిమాల్లో నటించాలని అనుకున్నారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు.

ఇది కూడా చదవండి: Israeli–Palestinian Conflict: ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిలో భారతీయులు ఎవరైనా చనిపోయారా? విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే?

బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించాలనే కోరికను తన తండ్రితో చెప్పినప్పుడు, తన భార్యను అడగమని తన తండ్రి చెప్పాడని డాక్టర్ జోషి తన పుస్తకంలో రాశారు. తన తండ్రి శివ బహదూర్ సింగ్ మాటలు విన్న అర్జున్ సింగ్ కి సినిమా మీద కోరిక తీరిపోయింది. నిజానికి అర్జున్ సింగ్ కాలేజీ రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ జోషి తన పుస్తకంలో అర్జున్ సింగ్‌ను ఉటంకిస్తూ, ‘‘మా నాన్న నా భార్యను అడగమని అడగడం ద్వారా నాతో దౌత్యం చేశారని, బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించాలనే నా ప్రణాళిక ప్రారంభం కాకముందే విఫలమైంది’’ అని చెప్పారు.

ఒక్క దెబ్బకు సీఎం కుర్చీ ఊడిపోయింది
1980లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టిన అర్జున్ సింగ్.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అర్జున్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ మెజారిటీ సాధించింది. ఎన్నికల విజయం తరువాత, ఆయన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. మార్చి 15, 1985న ఆయన మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఆయన తన మంత్రివర్గం జాబితాతో ఢిల్లీకి చేరుకోగానే, ఆయన ఊహించని నాటకీయత అక్కడ జరిగింది.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: బీజేపీ నేతలను టార్గెట్ చేసిన నక్సలైట్లు.. 24 మంది అభ్యర్థులకు ఎక్స్ కేటగిరీ భద్రత

పంజాబ్‌లో పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉన్న ఆ రోజులవి. అయితే అర్జున్ సింగ్‌పై విశ్వాసం వ్యక్తం చేసి ఆయనను పంజాబ్‌కు పంపారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. అక్కడ ఆయనకు పంజాబ్ గవర్నర్ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత మోతీలాల్ వోరా మధ్యప్రదేశ్ అధికారాన్ని చేపట్టారు.