నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ అంజి అనే ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. తాజాగా అల్లరి నరేష్ పాత్రని రిలీజ్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాస్ స్టెప్పులేసి, మాటొచ్చేస్తది.. అనే డైలాగ్ తో అల్లరి నరేష్ అదరగొట్టేసాడు. ఈ గ్లింప్స్ లోనే నరేష్ – నాగార్జున మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టు చూపించారు.