తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్‌రెడ్డికే మరోసారి అవకాశం కల్పించింది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో దీపక్‌రెడ్డి (బీజేపీ) తో పాటు నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్ఎస్) ఉన్నారు. ఈ ఉపఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌రెడ్డి 25,866 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.