×
Ad

తోక జాడిస్తే పాకిస్థాన్‌కు దీపావళి చూపించడానికి సిద్ధమైన భారత సైన్యం.. ఇక పాక్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే..

లక్నోలోని బహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌లో విజయవంతంగా రూపొందించిన అత్యాధునిక బ్రహ్మోస్ మిసైల్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో భారత సైన్యానికి అప్పగించారు. ఇది భారత రక్షణ రంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ ఘటన దేశ భద్రతా సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. శత్రుదేశాల ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా తక్షణమే తగిన సమాధానం ఇవ్వగల సత్తా భారత సైన్యానికి మరింత పెరిగింది. "పాక్‌లోని ప్రతి అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్ పరిధిలోనే ఉంది" అని భారత రక్షణ వర్గాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ ఏదైనా వంకర బుద్ధితో ముందుకు వస్తే, బ్రహ్మోస్ శక్తిని 'దీపావళి పండుగలా' చూపించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.