Simple Tips: మీ ఫోన్‌లో సూర్యగ్రహణాన్ని ఫొటో తీయండి!

ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌ లో బంధించాలని అనుకుంటున్నారా? గ్రహణాన్నిఫోన్లతో ఎలా ఫొటో తీయాలా ఆలోచిస్తున్నారా? సూర్య గ్రహణాన్ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఫొటోలను క్లిక్ అనిపించేలా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.

  • Publish Date - December 25, 2019 / 03:17 PM IST

ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌ లో బంధించాలని అనుకుంటున్నారా? గ్రహణాన్నిఫోన్లతో ఎలా ఫొటో తీయాలా ఆలోచిస్తున్నారా? సూర్య గ్రహణాన్ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఫొటోలను క్లిక్ అనిపించేలా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.

డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 8.17 గంటలకు గ్రహణం మొదలై మరోసటి రోజు శుక్రవారం ఉదయం 10.57 నిమిషాలకు ముగుస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం చూడవచ్చు.

ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా గ్రహణం కనిపిస్తుంది. భూమి, సూర్యుని మధ్యగా చంద్రుడు వచ్చిన సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమికి ఎంత దూరంలో చంద్రుడు ఉన్నాడు దానిబట్టి సూర్యగ్రహణం కనిపిస్తుంది.

అయితే ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌ లో బంధించాలని అనుకుంటున్నారా? గ్రహణాన్నిఫోన్లతో ఎలా ఫొటో తీయాలా ఆలోచిస్తున్నారా? సూర్య గ్రహణాన్ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఫొటోలను క్లిక్ అనిపించేలా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. కానీ, అంతకు ముందు మీరు సోలర్ ఫిల్టర్ లేకుండా సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఈ ఫిల్టర్లు సాధారణంగా మార్కెట్లో లభిస్తాయి.

ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లు లేదా సన్ గ్లాసెస్, చాలా చీకటిగా ఉండే అద్దాలు సైతం ఉపయోగించరాదు. కెమెరా, టెలిస్కోప్, బైనాక్యులర్లు లేదా ఇతర ఆప్టికల్ పరికరం ద్వారా నేరుగా సూర్యుడిని చూడవద్దు. మీ కళ్లకు శాశ్వత నష్టం కలిగే ప్రమాదం ఉందని మరవద్దు. సూర్య గ్రహణాన్ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఫొటోలను ఎలా తీయాలో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

1. మీ కళ్లకు పొలరైజడ్ అద్దాలు లేకుండా నేరుగా సూర్యగ్రహణాన్ని చూడొద్దు. 

2. కెమెరా సెన్సార్ దెబ్బతినకుండా కెమెరా లెన్స్ ఎదుట x-ray లేదా UV filiter వంటి ప్రొటెక్షన్ ఫిల్మ్ ఉంచాలి. 

3. సూర్యగ్రహాణాన్ని దగ్గరగా zoom చేయరాదు. లేదంటే మీ ఫొటో ఫిక్సల్స్ రెజుల్యుషన్ తగ్గి క్లారిటీ పోతుంది. 

4. మీ ఫోన్ కెమెరాలో 48MP లేదా 64MP షూటింగ్ మోడ్ ఉంటే Enable చేయండి. 

5. zooming చేయడానికి బదులుగా బెటర్ క్వాలిటీ కోసం high resolution ఇమేజస్ క్రాప్ చేయవచ్చు. 

6. గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలుగా ఎత్తైనా లొకేషన్ దగ్గరగా వెళ్తే మంచి లుక్ వస్తుంది. 

7. మీ స్మార్ట్ ఫోన్ కదలకుండా స్థిరంగా ఉండేందుకు Tripod టూల్ వాడండి.

8. ఫొటో కాప్చర్ రిమోట్ చేయడానికి బ్లూటూత్ లేదా బుల్ట్ ఇన్ సెల్ఫ్ టైమర్ వాడండి.

9. గ్రహణం దృశ్యం మొత్తాన్ని స్పష్టంగా తీయడానికి HDR మోడ్ వాడండి. 

10. స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ పై ఎక్లీప్స్ ఏరియాపై ట్యాప్ చేయండి.. ఎక్స్ పోజర్‌ను మ్యానువల్‌గా తగ్గించండి.