5 types of foods that increase blood cells
జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటివి వచ్చినప్పుడు రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య (Platelet Count) పడిపోవడం చాలా సాధారణం. ప్లేట్లెట్స్ అనేవి మన శరీరానికి రక్షణను అందిస్తాయి. కాబట్టి, వీటి సంఖ్య తగ్గడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి, ఈ సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోడం మంచిది. ఇవి ప్లేట్లెట్లను సహజంగా పెంచడంలో, జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి అలాంటి 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.బొప్పాయి ఆకులు:
బొప్పాయి ఆకులలో పపైన్ అనే యాక్టివ్ ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ల ఉత్పత్తిని ఘనంగా ప్రోత్సహిస్తుంది. అలాగే డెంగ్యూ లాంటి వైరల్ జ్వరాల సమయంలో ప్లేట్లెట్ల కౌంట్ పెరగడంకి ఇది ఒక ప్రకృతిసిద్ధమైన దివ్యౌషధం. ఈ ఆకుల రసాన్ని రోజుకు రెండు సార్లు 1 నుంచి 2 స్పూన్ల రసం తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.కానీ, గర్భిణీలు, చిన్నపిల్లలు ఉపయోగించే ముందు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.
2.సిట్రస్ ఫలాలు:
విటమిన్ C పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్లు పెరుగుతాయి. వాటిలో నిమ్మ, నారింజ, మోసంబీ పండ్లు ఉన్నాయి. వీటిని రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్లేట్లెట్లను తగ్గించే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో యాంటీఆక్సిడెంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఫీవర్ సమయంలో ఏర్పడే డీహైడ్రేషన్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
3.గుడ్డు:
ఉడికించిన గుడ్లు శరీరానికి అవసరమైన ప్రొటీన్లు సమకూరుస్తాయి. జ్వర సమయంలో శరీరం శక్తిహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో గుడ్డు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శక్తిని తిరిగి పొందేందుకు సహాయపడతాయి. ప్లేట్లెట్ల తయారీలో అమినో ఆమ్లాలు చాలా అవసరం. అవి గుడ్డు ద్వారా పుష్కలంగా అందుతాయి.
4.అరటిపండు:
జ్వర సమయంలో అధికంగా గ్లూకోజ్ అవసరం. కాబట్టి, ఆ సమయంలో అరటిపండు తినడం వల్ల త్వరగా శక్తినిచ్చే అందుతుంది. అలాగే, ప్లేట్లెట్ల నాశనాన్ని తగ్గించే న్యాచురల్ శక్తివంతమైన ఎనర్జీ ఫుడ్స్ లో అరటి ముందువరుసలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, నీరసాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, రోజుకి 1 లేదా 2 అరటిపండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
5.తులసి కషాయం (తులసి టీ):
తులసి ఆకులో యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఇది ప్లేట్లెట్ల కౌంట్ పెరగడానికి సహాయపడే ఇమ్యూన్ సిస్టమ్‌ను ఉత్తేజపరుస్తుంది. 5 నుంచి 6 తులసి ఆకులను నీటిలో మరిగించి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
ప్లేట్లెట్లను పెంచే ఇతర సూచనలు: