Health Tips: పురుషుల్లో పెరుగుతున్న తీవ్రమైన సమస్య.. ఇలా అయితే భవిష్యత్తు కష్టమే

Health Tips: మగవాళ్లలో ఉండే లైగిక సమస్యల కారణంగా కూడా సంతాన లేమి సమస్య వచ్చే అవకాశం ఉంది.

50 percent of men in India suffer from infertility problems

ఈ మధ్య కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. గత పదేళ్లలో ఈ సమస్య చాలా పెరిగింది. ఎన్నో ఆశలతో, ఎంతో ఆనందంగా పెళ్లి జీవితాన్ని మొదలుపెట్టిన జంటలకు ఈ సమస్య శాపంగా మారుతోంది. అయితే ఈ సమస్యకు కారణం ఆడా, మగ ఇద్దరిలోను ఉండవచ్చు. కానీ, ఎక్కువ శాతం మాత్రం మగవాళ్లే కారణం అవుతున్నారు. ఇండియాలో ఇప్పటికే 50 శాతం మంచి మగవాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిపుణుల ప్రకారం ఈ సమస్యకు చాలా కారణాలే ఉన్నాయట. కేవలం శుక్రకణలా లోపం వల్లనే సంతాన సమస్యలు రావడం అనేది సరైనది కాదని చెప్తున్నారు. మరి వారు చెప్తున్నా ఇతర కారణాలు, యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1. లైంగిక సమస్యలు:
మగవాళ్లలో ఉండే లైగిక సమస్యల కారణంగా కూడా సంతాన లేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. అందులో అంగస్తంభన సమస్యలు, స్ఖలన సమస్యలు, లైంగిక కోరిక తక్కువగా ఉండటం వంటివి సంతానోత్పత్తిని తీవ్రమైన ప్రభావితం చేస్తాయి. వీటిని ముందుగా గుర్తించడం అనేది ప్రధాన. ఇలాంటి వాటికి ముందే పరిష్కారం తెలుసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

2. జన్యు పరమైన కారణాలు:
వై క్రోమోజోమ్‌లో మైక్రోడిలీషన్స్ ప్రధానంగా అజూస్పెర్మియా ఫ్యాక్టర్ లేదా AzF వంటి జన్యు పరమైన కారణాల వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల తక్కువ శుక్రకణాల ఉత్పత్తి లేదా అసలు శుక్రకణాలు లేకపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల కూడా సంతాన లేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

3.ఒత్తిడి, భావోద్వేగ శ్రేయస్సు:
నేటి యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఒత్తిడి. పురుషుల్లో ఒత్తిడి గర్భధారణకు సంబంధించిన భావోద్వేగ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సంతాన లేమికి కారణం కావచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా అవసరం.

4. జీవనశైలిలో మార్పులు:
సమయపాలన లేని ఆహరం, ఊబకాయం, ధూమపానం, మద్యం వంటి కారకాలు శుక్రకణాల సంఖ్యను మాత్రమే కాదు, వాటి చలనాన్ని, ఆకృతిని, DNA ను కూడా ప్రభవిస్తాం చేస్తాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవన శైలీని అలవర్చుకోవడం మంచిది. ఇంకా మధుమేహం, రక్తపోటు వంటివి కూడా పురుషుల సంతానోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.