మహిళల్లో కంటే పురుషుల్లోనే Covid-19 ముప్పు ఎందుకు ఎక్కువంటే?

  • Publish Date - March 26, 2020 / 11:59 AM IST

గ్లోబల్ హెల్త్ 50/50 డేటా ప్రకారం.. కరోనా వైరస్ (Covid-19) మరణాల రేటు మహిళల్లో కంటే పురుషుల్లోనే అత్యధికంగా ఉంటుందని సీఎన్ఎన్ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన ఇటలీలో కొవిడ్ మరణాల రేటుపై నేషనల్ హెల్త్ ఇన్సిస్ట్యూట్ (the Istituto Superiore di Sanità or ISS) గణాంకాలను విడుదల చేసింది. ఇందులో పురుషుల్లో 60 శాతం మంది కొవిడ్-19 పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 70శాతం మరణాలు సంభవించినట్టు పేర్కొంది.

చైనా, దక్షిణ కొరియాలో విశ్లేషించగా ఇదే తరహా ట్రెండ్ కనిపించినట్టు తెలిపింది. అమెరికాలో మాత్రం లింగ విభజన డేటాను రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి కచ్చితమైన శాస్త్రీయ అధ్యయనమంటూ ఏది లేదు. కానీ, పొగ తాగే అలవాటు ఉన్న పురుషుల్లో ఎక్కువ మందికి అనారోగ్య సమస్యల కారణంగా కొవిడ్ వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. కొత్త కరోనా వైరస్‌ నుంచి ఎవరికి వ్యాధినిరోధకత ఉండదు. కానీ, వృద్ధులపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పొగతాగే జనాభా ఉన్న చైనాలో 50శాతానికి పైగా పురుషులు పొగ తాగుతారు. మహిళలతో పోలిస్తే 3 శాతం తక్కువగా ఉన్నారు. ఇటలీలో 4.5 మిలియన్ల మంది మహిళలు స్మోకింగ్ అలవాటు ఉంటే.. 7 మిలియన్ల మంది పురుషులకు స్మోకింగ్ అలవాటు ఉంది.

వాస్తవానికి ఇటలీలో ISS చెప్పిన ప్రకారం.. 99 శాతం మంది ప్రజలు ఇతర అనారోగ్య కారణాల రీత్యా కొవిడ్-19 వైరస్ సోకినట్టు గుర్తించింది.  వైరస్ సోకడానికి ముందే 75 శాతం మంది అధిక రక్తపోటు సమస్యలతో బాధ పడుతున్నట్టు వెల్లడించింది. ఇక్కడ ఎక్కువ మంది వర్క్ కోసం ప్రయాణాలు చేస్తుంటారు లేదా ఎక్కువ మంది పురుషులు మహిళల కంటే ఇతక అనారోగ్య సమస్యలపై పరీక్షలు చేయించుకుంటున్నారు.

గ్లోబల్ హెల్త్ 50/50 విశ్లేషణ ప్రకారం.. ఇది సమగ్రమైన డేటా కాదు.. ప్రపంచ జనాభాలో 25శాతం కవర్ అవుతుంది. ప్రతి దేశంలో లింగ విభజన డేటాలో 10 శాతం మధ్య, 90 శాతం కంటే ఎక్కువ మరణాల రేటు కరోనా వైరస్ సోకడం కారణంగానే జరిగింది. అందులో మహిళల్లో కంటే పురుషుల్లోనే అధికంగా ఉన్నారు. అదే భారతదేశంలో కూడా ఇప్పటివరకూ నమోదైన 10 కరోనా మరణాల్లో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారు. 

గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో SARS, MERS వంటి వైరస్‌ల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. MERS-Cov ఇన్ఫెక్షన్లపై అధ్యయనం ప్రకారం.. సౌదీ అరేబియాలో పురుషుల్లోనే అత్యధికంగా మరణాలు సంభవించాయి. మహిళల్లో శుభ్రతవంటి చర్యలు, ఆరోగ్యం విషయంలో తీసుకున్న జాగ్రత్తలే వారిని వైరస్ బారినుంచి రక్షించాయి. ఇన్ఫూయింజా వైరస్ ప్రబలిన సమయాల్లో H1N1 వంటి వైరస్ లు సోకిన సమయాల్లో విశ్లేషించిన డేటాపై అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనంలో మహిళ్లలో మరణాల రేటు కనిష్ట స్థాయిలోనే ఉందని పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళలు ముఖానికి బుర్ఖాలు ధరించడం కూడా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు.  ప్రతి 10 మహిళల మరణాలకు ఎక్కువ సంఖ్యలో పురుషుల మరణాలు నమోదు అవుతున్నాయని అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తితో ఇటలీలో (24), చైనాలో (18), జర్మనీలో ‘16), ఇరాన్ లో (14), ఫ్రాన్స్ (14), సౌత్ కొరియాలో (12)గా మరణాలు రేటు నమోదయ్యాయి. 

ట్రెండింగ్ వార్తలు