Sharks squalene for Covid-19 Vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనాను అంతం చేయాలంటే సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాల్సిందే. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేయాలంటే సాధ్యపడే విషయం కాదు.. అందరికి కరోనా వ్యాక్సిన్లను తగినంత మోతాదులో అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ల (COVID-19 Vaccine Doses) అధిక మోతాదులను తయారుచేసేందుకు కనీసం 5 లక్షల (5 Lakh Sharks Slaughtered) షార్క్ లను వధించే అవకాశం ఉందని పర్యావరణ పరిరక్షకులు హెచ్చరిస్తున్నారు.
అన్ని వ్యాక్సిన్లలో వ్యాధినిరోధకతను పెంచే ‘adjuvant’ అని పిలిచే ఇమ్యూనోలాజికల్ ఏజెంట్ ఉంటుంది. దీన్ని లాటిన్ భాషలో ‘help’ సహయం అని అర్థం. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ‘adjuvant’ ఏజెంట్ సాయంతో వ్యాక్సిన్ల ద్వారా మరిన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేయొచ్చు.
ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా వ్యాధి నుంచి దీర్ఘకాలిక రోగనిరోధకతను పెంచుకునేందుకు సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాంటి సహాయకులలో షార్క్ కాలేయంలో ఉండే స్క్వాలేన్ (squalene), సహజ నూనె పదార్థం లాంటిది. ఒక టన్ను స్క్వాలేన్ పొందటానికి, సుమారు 3,000 షార్కులను వధించాల్సి ఉంటుంది.
ప్రతి వ్యక్తికి ఒక్కొక్క మోతాదు COVID-19 వ్యాక్సిన్‌ను రూపొందించడానికి కాలేయ నూనె (liver oil) కోసం సుమారు 2.5 లక్షల చంపవలసి ఉంటుందని కాలిఫోర్నియాకు చెందిన షార్క్ మిత్రరాజ్యాల పరిరక్షణ బృందం హెచ్చరించింది. ఒక వ్యక్తికి రెండు మోతాదు అవసరమైతే, అప్పుడు షార్కుల సంఖ్య 5 లక్షలకు రెట్టింపు అవుతుంది.
అనేక ఇతర జంతువుల కాలేయాలలో కూడా స్క్వాలేన్ (squalene) ఉంటుంది. కానీ, ఈ నేచురల్ ఆర్గానిక్ కంపౌండ్ కోసం షార్కులు ప్రధాన వాణిజ్య వనరులుగా మారాయి. పరిరక్షకుల అంచనా ప్రకారం.. ప్రతి ఏడాదిలో 30 లక్షల షార్కులను చంపేస్తున్నారని అంటున్నారు.
షార్కుల్లో కాలేయంలో ఉండే స్క్వాలేన్ (squalene) సేకరించి కాస్మెటిక్స్, మిషన్ ఆయిల్ సహా ఇతర ప్రొడక్టుల్లో వినియోగిస్తుంటారు. బ్రిటన్ ఫార్మా దిగ్గజం GlaxoSmithKline ఇప్పటికే Covid-19 వ్యాక్సిన్ల కోసం షార్క్ స్క్వాలేన్ వినియోగించి భారీగా 100 కోట్ల మోతాదుల ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది.
కోవిడ్ వ్యాక్సిన్ల భారీ ఉత్పత్తి చేసే డిమాండ్‌లు అమాంతం పెరిగేసరికి.. షార్కుల పరిరక్షకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది షార్కుల సంతతికి ముప్పు మాత్రమే కాదని, షార్కు జాతులు అంతరించిపోయేందుకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి, ఈ నూనెలో సమృద్ధిగా ఉన్న గల్పర్ షార్క్, బాస్కింగ్ షార్క్ వంటి జాతులు ఇప్పటికే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మరోవైపు షార్కు జాతులను రక్షించేందుకు సైంటిస్టులు పులియబెట్టిన చెరకు నుండి తయారైన స్క్వాలేన్ సింథటిక్ వెర్షన్‌పై పరిశోధనలు చేస్తున్నారు . ఇప్పటివరకు 3.3 కోట్లకు పైగా వైరస్ సోకగా.. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిని కరోనావైరస్ బలితీసుకుంది.