ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే  

ఐస్ క్రీం చూస్తే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. చిన్నపిల్లలైతే చెప్పనక్కర్లేదు. పళ్లు లేని ముసలాడు కూడా ఐస్ క్రీంకు పిధా అయిపోవాల్సిందే. అందరికి ఐస్ క్రీం యూనివర్శల్ ఫావరేట్. ఎన్నో ఫేవర్లలో ఐస్ క్రీంలను చూశాం.

  • Publish Date - February 14, 2019 / 10:27 AM IST

ఐస్ క్రీం చూస్తే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. చిన్నపిల్లలైతే చెప్పనక్కర్లేదు. పళ్లు లేని ముసలాడు కూడా ఐస్ క్రీంకు పిధా అయిపోవాల్సిందే. అందరికి ఐస్ క్రీం యూనివర్శల్ ఫావరేట్. ఎన్నో ఫేవర్లలో ఐస్ క్రీంలను చూశాం.

ఐస్ క్రీం.. చూస్తే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. చిన్నపిల్లలైతే చెప్పనక్కర్లేదు. పళ్లు లేని ముసలాళ్లు కూడా ఐస్ క్రీంకు ఫిదా అయిపోవాల్సిందే. అందరికి ఐస్ క్రీం యూనివర్శల్ ఫావరేట్. ఎన్నో ఫేవర్లలో ఐస్ క్రీంలను చూశాం. చక్కగా ఆరంగించేశాం. ఆయుర్వేదిక్ ఐస్ క్రీంను ఎప్పుడైనా తిన్నారా? పోనూ చూశారా? అయితే ఇప్పుడు చూడండి.. ఆ తరువాత వీలైంతే ఓసారి రుచి చూడండి. ఆయుర్వేదిక్ ఐస్ క్రీం అన్ని చోట్ల దొరకదండోయ్.. న్యూయర్క్ లోని ఇండియన్ రెస్టారెంట్ లో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ ఈ ఐస్  క్రీం ఎంతో ఫేమస్. చేతులతో తయారుచేసే ఈ ఆయుర్వేదిక్ ఐస్ క్రీంకు ఫుల్ క్రేజ్.

మిగతా ఐస్ క్రీం రెస్టారెంట్ల కంటే ఈ ఐస్ క్ర్రీం రెస్టారెంట్ కే కస్టమర్లు క్యూ కట్టేస్తున్నారు. ఇందులో దొరికే ఐస్ క్రీం ఫ్లేవర్స్ ఎంతో రుచికరంగా ఉంటాయట. చూడటానికి ఈ ఐస్ క్రీం పసుపు రంగులో ఉంటుంది. ఆయుర్వేదిక్ ఐస్ క్రీంలో పసుపు కూడా ఉండటంతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాండిచేరి NYC అనే రెస్టారెంట్ లో రుచికరమైన డిషెస్ సర్వ్ చేస్తున్నారు. ఆయుర్వేదపరంగా ఎన్నో ఔషధ గుణాలన్న నువ్వులు, గసగసాలు, మునగకాయతో తయారుచేసిన ఐస్ క్రీం ప్లేవర్లను తినేందుకు భోజన ప్రియులంతా ఎగబడతున్నారు.
 

చూడటానికి గ్రుండగా ఆకారంలో కనిపించే ఐస్ క్రీం ప్లేవర్లను రెస్టారెంట్లకు వచ్చిన కస్టమర్లకు ఐస్ క్రీం ప్రత్యేకమైన కోన్లలో సర్వ్ చేయడం విశేషం. అంతేకాదు.. బొప్పాయి, ఆరేంజ్, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వుల గింజలు, మునగ ఆకులు, పిస్తాలను దంచుతారు. ఈ మిశ్రమంతో చాకలేట్ చిల్లి కుకీ తయారు చేస్తారు. దీంతో బంగారు వర్ణంలో, పసుపు వర్ణంలో ఐస్ క్రీంలను తయారు చేయడం ఇక్కడ స్పెషల్. పసుపు పౌడర్, గసగసాలు, చిల్లీ పౌడర్, రోజా పూల మిశ్రమంతో ఐస్ క్రీం కోన్లను తయారుచేస్తారు.

వీటిలోనే ఐస్ క్రీంను సర్వ్ చేస్తుంటారు. రెస్టారెంట్ అందించే ప్లేవర్లలో ఏమైనా రెండు ఫ్లేవర్లను మిక్స్ చేసుకొని ఆరంగించవచ్చు. చీజ్ సమోసా, టమోటా కసుండి, క్రాబ్ కర్రీ వంటి మరిన్ని ఇండియన్ డిషెస్ ను సర్వ్ చేస్తున్నారు. బోర్న్ వీటా ఐస్ క్రీం, శాండ్ విచ్, పార్లే జీ బిస్కట్లు కూడా ఇండియన్ రెస్టారెంట్ లో ఫుల్ గిరాకీ ఉంటుందట. న్యూయార్క్ వెళ్లినప్పుడు ఓసారి ఈ ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లి అయర్వేదిక్ ఐస్ క్రీంను రుచి చూడండి.

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది

Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు

Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్

ట్రెండింగ్ వార్తలు