Avoid Liver Damage : కాలేయానికి పెనుముప్పును తెచ్చిపెట్టే గతి తప్పిన జీవనశైలి! కాలేయం దెబ్బతినకుండా నివారించాల్సిన హానికరమైన అలవాట్లు ఇవే?

అదనపు కొవ్వు కాలేయ కణాలలో పేరుకుపోతుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారితీస్తుంది. ఫలితంగా, కాలేయం ఉబ్బిపోతుంది. కాలక్రమేణా, ఇది గట్టిపడుతుంది. కాలేయ కణజాలం సిర్రోసిస్ కు దారి తీస్తుంది.

avoid liver damage

Avoid Liver Damage : మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవంగా కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం జీవక్రియ, జీర్ణక్రియ, టాక్సిన్స్ తొలగింపు, పోషకాల నిల్వ అనేక ఇతర ముఖ్యమైన విధుల్లో సహాయపడుతుంది. క్యాలరీలు అధికంగా ఉండే చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, పెయిన్ కిల్లర్లను క్రమం తప్పకుండా తీసుకోవడం, నిశ్చలమైన మరియు అధిక ఒత్తిడితో కూడిన జీవనశైలిని వల్ల మీ కాలేయం దెబ్బతింటుంది. ఇటీవలి కాలంలో కాలేయ సమస్యలు అధిక మయ్యాయి. దీనికి ముఖ్యకారణం జీవనశైలి గతి తప్పటమేనని నిపుణులు అభిప్రాయంపడుతున్నారు. రోజువారి తీసుకునే ఆహారాలు, పానీయాలు ఇందుకు ముఖ్యకారణాలుగా చెబుతున్నారు. ఇవి కాలేయ కణాలపై దుష్ప్రభావం చూపటం వల్ల పెను ప్రమాదం వాటిల్లుతుంది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం తదితర కారణాల వల్ల కాలేయ సమస్యల బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

కాలేయం దెబ్బతినకుండా నివారించాల్సిన హానికరమైన అలవాట్లు ;

చక్కెర : ఎక్కువ చక్కెర దంతాలకు మాత్రమే హానికలిగిస్తుందనుకుంటే పొరపాటే. అది మీ కాలేయానికి కూడా దెబ్బతీస్తుంది. కాలేయం కొవ్వును తయారు చేయడానికి ఫ్రక్టోజ్ అని పిలువబడే ఒక రకమైన చక్కెరను ఉపయోగిస్తుంది. శుద్ధి చేసిన చక్కెర మరియు అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయ వ్యాధికి దారితీసే కొవ్వు పేరుకుపోవటానికి కారణమవుతుంది. అధిక బరువు లేకపోయినా షుగర్ ఆల్కహాల్ లాగానే కాలేయానికి హాని కలిగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సోడా, పేప్సీ, మిఠాయిలు వంటి అదనపు చక్కెరలతో కూడిన ఆహారాన్ని పరిమితం చేయటం లివర్ ఆరోగ్యానికి మేలు.

హెర్బల్ సప్లిమెంట్స్ ; కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలకు హెర్బల్ సప్లిమెంట్స్ ను ఉపయోగిస్తారు. అయితే ఈ హెర్బల్ సప్లిమెంట్స్ కాలేయం సరిగ్గా పనిచేయకుండా చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హెపటైటిస్ , కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. కొన్ని దేశాలు ఈ తరహా హెర్బ్‌ను నిషేధించాయి. పరిమితం చేశాయి, ఏదైనా మూలికలను తీసుకునే ముందు అవి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వైద్యులను సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.

అదనపు పౌండ్లు ; అదనపు కొవ్వు కాలేయ కణాలలో పేరుకుపోతుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారితీస్తుంది. ఫలితంగా, కాలేయం ఉబ్బిపోతుంది. కాలక్రమేణా, ఇది గట్టిపడుతుంది. కాలేయ కణజాలం సిర్రోసిస్ కు దారి తీస్తుంది. అధిక బరువు లేదా ఊబకాయం, మధ్య వయస్కులు లేదా మధుమేహం కలిగి ఉండేవారు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పొందే అవకాశం ఉంది. ఆహారం మరియు వ్యాయామం ద్వారా దీనిని అరికట్టవచ్చు.

విటమిన్ ఎ సప్లిమెంట్ అధిక వినియోగం ; శరీరానికి విటమిన్ ఎ అవసరం ఉంది. తాజా పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా ఎరుపు, నారింజ మరియు పసుపు వంటి మొక్కల నుండి దీనిని పొందడం మంచిది. విటమిన్ ఎ అధిక మోతాదులో ఉన్న సప్లిమెంట్లను తీసుకుంటే, అది కాలేయానికి సమస్యగా మారుతుంది. అదనపు విటమిన్ A తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది.

శీతలపానీయాలు ; శీతల పానీయాలు ఎక్కువగా తాగే వారికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పానీయాలే కారణమని అధ్యయనాలు నిరూపించలేదు. అయితే కాలేయాన్ని దెబ్బతీసే వాటిలో ఇవి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఒక వేళ తాగాల్సి వస్తే కొద్ది మోతాదుకే పరిమితం కావటం మంచిది.

ఎసిటమైనోఫెన్ ;వెన్నునొప్పి లేదా తలనొప్పి , జలుబు నివారిణి కోసం ఎసిటమైనోఫెన్ తీసుకుంటారు. దీనిని సరైన మోతాదులో తీసుకోవటం మంచిది. అనుకోకుండా ఎసిటమైనోఫెన్ చాలా ఎక్కువగా తీసుకుంటే అది మీ కాలేయానికి హాని కలిగించవచ్చు. మోతాదును తనిఖీ చేయటం మంచిది. ఒక రోజులో ఎంత తీసుకుంటే సరిపోతుందో వైద్యులను అడిగి తెలుసుకున్న తరువాత మాత్రమే వినియోగించాలి.

ట్రాన్స్ ఫ్యాట్స్ ; ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది కొన్ని ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కాలేయానికి మంచిది కాదు.

అధిక మోతాదు ఆల్కహాల్ ; అతిగా తాగడం మీ కాలేయానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మద్యానికి బానిసైతే ఆప్రభావం కాలేయంపై పడుతుంది. మీరు తాగే మద్యం మితంగా ఉండేలా చూసుకోవాలి. వైన్ తీసుకుంటే 5 ఔన్సులకు మించరాదు. అదే బీర్ అయితే 12 ఔన్సులకు మించకుండా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.