Sleep Problems : నిద్రలేమి సమస్యలతో మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుందా?

నిద్రలేమితో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, రోగనిరోధక వ్యవస్థను దెబ్బతింటుంది. త్వరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ అధికంగా విడుదలవుతుంది.

Sleep Problems : నిద్రలేమి సమస్యలతో మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుందా?

sleep problems

Updated On : August 20, 2022 / 4:26 PM IST

Sleep Problems : శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీవన విధానం, తీవ్రమైన ఒత్తిడి చాలా మందిలో నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. అదే క్రమంలో అనారోగ్య సమస్యలు నిద్ర సరిగ్గా రాకపోవటానికి కారణమౌతున్నాయి. సరైన నిద్రతోనే మెదడులో చురుకుదనం కలుగుతుంది. దీని వల్ల రోజు వారి కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించేందుకు వీలుంటుంది. సరైన నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల రోజంతా చురుకుగా ఉండవచ్చు.

చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, అతిగా స్పందించడం వంటి వాటి వల్ల నిద్రకు దూరం కావాల్సి వస్తుంది. నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని అధ్యయానాల్లో తేలింది. నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని అనేక పరిశోధనల్లో తేలింది. పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమితో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, రోగనిరోధక వ్యవస్థను దెబ్బతింటుంది. త్వరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ అధికంగా విడుదలవుతుంది. దీని వల్ల అతిగా ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉద్యోగుల పనివేళల్లో మధ్యాహ్నం పావుగంట సమయం కునుకు తీయడం వల్ల ఉత్సాహం కలుగుతుంది. అలసిపోయినప్పుడు కొద్దిసేపు నిద్రపోయి పోవటం ఆరోగ్యానికి చాలా మంచిది.

రోజు వారిగా నిద్ర ఎంతసేపు పోతే ఆరోగ్యానికి మంచిదన్న విషయంపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్రపోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు. అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.